Au University : ఏయూలో రెండు కోర్సుల ఎత్తివేత…అడ్మిషన్లు నిలిపివేత

అయా కోర్సులకు సంబంధించిన భోధనా సిబ్బంది లేకపోవటంతోపాటు, కోర్సులను కష్టపడి పూర్తిచేసిన విద్యార్ధులకు భవిష్యత్తులో ఎలాంటి ఉపాధి అవకాశాలు లభించకపోవటంతో దీనిపై ఆసక్తి చూపిస్తున్న వారి

Au University : ఏయూలో రెండు కోర్సుల ఎత్తివేత…అడ్మిషన్లు నిలిపివేత

Au

Au University : అధ్యాపకుల కొరత, కోర్సులు పూర్తి చేసిన వారికి సరైన ఉపాధి అవకాశాలు లేకపోవటం వెరసి విశ్వవిద్యాలయంలోని పలు కోర్సుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుంది. తాజా ఆంధ్ర విశ్వ విద్యాలయం సైన్స్ కళాశాల పరిధిలో నిర్వహిస్తున్న రెండు కోర్సుల బోధన నిలిచిపోయింది. ఈ విద్యా సంవత్సరం నుండి బోటనీ విభాగంలో హార్టికల్చర్ అండ్ ల్యాండ్ స్కేప్ మేనేజ్ మెంట్, అగ్రికల్చర్ బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలను నిలిపివేయాలని నిర్ణయించారు.

అయా కోర్సులకు సంబంధించిన భోధనా సిబ్బంది లేకపోవటంతోపాటు, కోర్సులను కష్టపడి పూర్తిచేసిన విద్యార్ధులకు భవిష్యత్తులో ఎలాంటి ఉపాధి అవకాశాలు లభించకపోవటంతో దీనిపై ఆసక్తి చూపిస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ నేపధ్యంలోనే ఈరెండు కోర్సులను ఎత్తివేసినట్లు విశ్వవిద్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఏపిలో వ్యవసాయ విశ్వ విద్యాలయాల్లో మినహా ఈ కోర్సులు ఎక్కడా లేవు. ఆంధ్ర విశ్వ విద్యాలయంలో మాత్రమే ఈ కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం ఆయా కోర్సులను చేయాలనుకునే విద్యార్ధికి ఆంధ్ర యూనిర్శిటీలో 60 వేల నుండి 70వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇదే కోర్సులు వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో పూర్తిచేయాలంటే 3లక్షల రూపాయల నుండి 4లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. విద్యార్ధులకు ఉపయోగపడే కోర్సులను ఎత్తివేయటం ఏంటన్న ప్రశ్నలను పలువురు లేవనెత్తుతుండగా, డిమాండ్ లేకపోవటం వల్లే కోర్సులను ఎత్తివేయాల్సి వచ్చిందని యూనివర్శిటీ అధికారులు చెబుతున్నారు.