చెక్ ఇట్ : CAT 2019 ఫలితాలు వచ్చేశాయి

  • Published By: veegamteam ,Published On : January 4, 2020 / 09:26 AM IST
చెక్ ఇట్ : CAT 2019 ఫలితాలు వచ్చేశాయి

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్(IIM) లో ప్రవేశాల కోసం నవంబర్ లో కామన్ అడ్మిషన్ టెస్టు(CAT) ను నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కోజికోడ్ శనివారం(జనవరి 4, 2020)  ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్ధులు ఫలితాలను అధికారిక వెబ్ సైట్ ద్వారా చూసుకోవచ్చు అని తెలిపింది.

క్యాట్ సోర్క్ డిసెంబర్ 31, 2020 వరకు వర్తిస్తుంది. పరీక్షలో కటాఫ్ మార్కులు, అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్ధులకు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 90 పర్సంటైల్ కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్ధులకు బిజినెస్ స్కూళ్లలో అడ్మిషన్స్ కల్పిస్తారు. క్యాట్ సోర్క్ ద్వారా నాన్ ఐఐఎం ఇన్ స్టిట్యూట్ లోను అభ్యర్దులను ఎంపిక చేస్తారు.

దేశంలో 156 నగరాల్లో క్యాట్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష 3 గంటల పాటు జరిగింది. పరీక్షలో మెుత్తం 3 సెక్షన్లు ఉన్నాయి. ఒక్కో సెక్షన్ కి గంట సమయం కేటాయించారు. క్యాట్ పరీక్ష ద్వారా దేశంలోని 20 ఐఐఎంలలో ప్రవేశాలు కల్పించనుంది.