దరఖాస్తు చేసుకోండి : సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ ఉద్యోగాలు

  • Published By: veegamteam ,Published On : December 26, 2019 / 09:59 AM IST
దరఖాస్తు  చేసుకోండి : సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ ఉద్యోగాలు

సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కోసం రైల్వే రిక్రూట్ మెంట్ సెల్(RRC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మెుత్తం 2 వేల 562 ఖాళీలు ఉన్నాయి.  విభాగాల వారీగా ఖాళీలను భర్తి చేయనుంది. అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

విభాగాల వారీగా ఖాళీలు :
ముంబాయి క్లస్టర్ :
క్యారేజ్ & వ్యాగన్(కోచింగ్) వాడి బండర్ – 258
కల్యాణ్ డిజిల్ షెడ్ – 53
కుర్లా డిజిల్ షెడ్ – 60
Sr.DEE (TRS) కళ్యాణ్ -179
Sr.DEE (TRS) కుర్లా – 192
పరేల్ వర్క్‌షాప్ – 418
మాతుంగా వర్క్‌షాప్ – 547
ఎస్ & టి వర్క్‌షాప్, బైకుల్లా – 60

భుసవాల్ క్లస్టర్ :
క్యారేజ్ & వ్యాగన్ డిపో – 122
ఎలక్ట్రికల్ లోకో షెడ్ – 80
ఎలక్ట్రికల్ లోకోమోటివ్ వర్క్‌షాప్ – 118
మన్మడ్ వర్క్‌షాప్ – 51
TMW నాసిక్ రోడ్ – 50

పుణే క్లస్టర్ :
క్యారేజ్ & వ్యాగన్ డిపో – 31
డీజిల్ లోకో షెడ్ – 121

నాగ్ పూర్ క్లస్టర్ : 
ఎలక్ట్రిక్ లోకో షెడ్, అజ్ని – 48
క్యారేజ్ & వాగన్ డిపో – 80

సోలాపూర్ క్లస్టర్ :
క్యారేజ్ & వ్యాగన్ డిపో – 73
కుర్దువాడి వర్క్‌షాప్ – 21

విద్యార్హత :
అభ్యర్ధులు 10వ తరగతిలో 50 శాతం మార్కులతో  ఉత్తీర్ణలై ఉండాలి. సంబంధింత విభాగంలో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి.

వయోపరిమితి :
అభ్యర్ధులకు జనవరి1,2020 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. నిబంధనల ప్రకారం వయసులో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు :
జనరల్,ఓబిసీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. SC, ST, దివ్యాంగులు, మహిళా అభ్యర్ధులకు మాత్రం ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపికా విధానం :
అభ్యర్ధులను  మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్య తేదిలు : 
దరఖాస్తు ప్రారంభ తేది : డిసెంబర్ 23,2019
దరఖాస్తు చివరి తేది : జనవరి 22,2020