Intermediate : ఇంటర్ ఫస్ట్ ఇ‌యర్‌ పరీ‌క్షల టైంటే‌బు‌ల్‌లో మా‌ర్పులు

తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇ‌యర్‌ పరీ‌క్షల టైంటే‌బు‌ల్‌లో స్వల్ప‌మా‌ర్పులు చేయా‌లని ఇంట‌ర్మీడియట్ బోర్డు నిర్ణ‌యిం‌చింది. రెండు రోజు‌ల‌పాటు పరీక్ష తేదీ‌లను మార్చనున్నారు.

Intermediate : ఇంటర్ ఫస్ట్ ఇ‌యర్‌ పరీ‌క్షల టైంటే‌బు‌ల్‌లో మా‌ర్పులు

Inter

Intermediate first Year Exams : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇ‌యర్‌ పరీ‌క్షల టైంటే‌బు‌ల్‌లో స్వల్ప‌మా‌ర్పులు చేయా‌లని ఇంట‌ర్మీడియట్ బోర్డు నిర్ణ‌యిం‌చింది. హుజూ‌రా‌బాద్‌ ఉప‌ఎ‌న్నిక నేప‌థ్యంలో ముందుగా ప్రక‌టించిన షెడ్యూ‌ల్‌లో రెండు రోజు‌ల‌పాటు పరీక్ష తేదీ‌లను మార్చ‌ను‌న్నారు. ఈ మేరకు ప్రభుత్వ అను‌మతి తీసు‌కొని, ఒక‌ట్రెండు రోజుల్లో అధి‌కా‌రిక ప్రక‌టన చేయ‌ను‌న్నారు. ఇంటర్ ఫస్ట్ ఇ‌యర్‌ పరీ‌క్ష‌లను అక్టోబర్ 25 నుంచి నవం‌బర్‌ 2వ తేదీ వరకు నిర్వ‌హించనున్న సంగతి తెలి‌సిందే.

అక్టోబర్‌ 30న హుజురాబాద్‌ ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. నవంబర్‌ 2న ఉప ఎన్నిక ఫలితాలు ప్రకటించనున్నారు. ఎన్నికల నిర్వహణ ముందు అంటే.. అక్టోబర్‌ 29 వ తేదీ మరియు అక్టోబర్‌ 30 వ తేదీల్లో హుజురాబాద్‌ నియోజక వర్గంలో 144 సెక్షన్‌ విధిస్తారు. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మిడియట్‌ బోర్డు ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం… సెప్టెబర్‌ 24 నే ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు మొదలు కానున్నాయి.

Telangana : అక్టోబర్ 25 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్

ఈ లెక్కన అక్టోబర్‌ 29న ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌ పరీక్షలు జరుగనుండగా 30న కెమిస్ట్రీ, కామర్స్‌ పరీక్షలు జరగాల్సివుంది. దీంతో పరీక్ష నిర్వహణ దాదాపుగా సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా విద్యాశాఖ అధికారులు ముందు.. ఆ తేదీన జరిగే పరీక్షలను వాయిదా వేయడం లేదా… సెంటర్లను తరలించడం వంటివి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వంతో చర్చలు జరిపి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.