Job Replacement : భారత్ లో కాగ్నిజెంట్ సంస్ధ 45వేల మందికి ఉద్యోగాలు..

2021 పూర్తి సంవత్సరానికి ఆదాయం 11 శాతం మేర వృద్ధి చెంది 18.5 బిలియన్‌ డాలర్లుగా ఉండొచ్చని ప్రకటించింది. మరోవైపు సంస్థ ఉద్యోగుల సంఖ్య 3,01,300 నుంచి 3,18,400కు పెరిగింది.

Job Replacement : భారత్ లో కాగ్నిజెంట్ సంస్ధ 45వేల మందికి ఉద్యోగాలు..

Cognizant

Job Replacement : న్యూజెర్సీని కేంద్రంగా ఉన్న కాగ్నిజెంట్ సంస్ధ భారత్‌లో అత్యధిక ఉద్యోగులతో ఐటీ ఔట్ సోర్సింగ్ సేవలందిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఆ సంస్ధ భారత్‌లో కొత్తగా 45,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అక్టోబర్‌,డిసెంబర్‌ మాసాలలలో ఉద్యోగులను తీసుకోనున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఈ సంస్ధకు భారత్‌లో 2 లక్షల మంది ఉద్యోగులున్నారు. నిపుణులకు డిమాండ్‌ సరఫరా మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. వార్షికంగా చూస్తే స్వచ్చందగా సంస్ధ వదిలిపెట్టి వెళుతున్న రేటు 33 శాతానికి పెరిగినట్టు తెలిపింది.

ఈ సంస్థ జనవరి–డిసెంబర్‌ను వార్షిక సంవత్సరంగా పరిగణిస్తుంటుంది. . సెప్టెంబర్‌ త్రైమాసికంలో డిజిటల్‌ విభాగం ఆదాయం 18 శాతం వృద్ధిని చూపించినట్టు సీఈవో హంఫైర్స్‌ తెలిపారు. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో మెరుగైన పనితీరు చూపించింది. సంస్థ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 56 శాతం పెరిగి 544 మిలియన్‌ డాలర్లు (రూ.4,080 కోట్లు)గా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో (2020 సెప్టెంబర్‌ త్రైమాసికం) నికర లాభం 348 మిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. కంపెనీ ఆదాయం 12 శాతం పెరిగి 4.7 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం 4.2 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. రూ.4.69–4.74 బిలియన్‌ డాలర్ల మధ్య ఆదాయం ఉండొచ్చన్న గత అంచనాలకు అనుగుణంగానే సంస్థ పనితీరు ఉంది.

2021 నాలుగో త్రైమాసికంలో  ఆదాయం 4.75–4.79 బిలియన్‌ డాలర్ల మేర ఉండొచ్చన్న అంచనాను చేసింది. ఇది వార్షికంగా చూస్తే 13.5–14.5 శాతం వృద్ధికి సమానమని వివరించింది. 2021 పూర్తి సంవత్సరానికి ఆదాయం 11 శాతం మేర వృద్ధి చెంది 18.5 బిలియన్‌ డాలర్లుగా ఉండొచ్చని ప్రకటించింది. మరోవైపు సంస్థ ఉద్యోగుల సంఖ్య 3,01,300 నుంచి 3,18,400కు పెరిగింది.