Appsc : ఏపీలో 1,180 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు

అభ్యర్ధుల వయోపరిమితికి సంబంధించి ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వుడ్ క్యాటగిరి అభ్యర్ధులకు గరిష్ట వయో పరిమితి పెంపుకు సంబంధించిన గతంలో ఇచ్చిన ఉత్

Appsc : ఏపీలో 1,180 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు

Appsc1

Appsc : ఏపిలో త్వరలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టనున్నారు. ఇందుకోసం త్వరలో నోటిఫికేషన్లు విడదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రంగం సిద్ధం చేసింది. మరో పదిరోజుల్లో నోటిఫికేషన్లు జారీకి కసరత్తు కొనసాగుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,180 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

పోస్టుల వారిగా భర్తీ చేయనున్న ఖాళీలను పరిశీలిస్తే.. యునాని మెడికల్ ఆఫీసర్ 26 ఖాళీలు, హోమియోపతి మెడికల్ ఆఫీసర్ 53 ఖాళీలు, ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ 72ఖాళీలు, హోమియో లెక్చరర్ 24ఖాళీలు, డాక్టర్ ఎన్ ఆర్ ఎస్ జీఏసీ ఆయుష్ లెక్చరర్ 3ఖాళీలు, జూనియర్ అసిస్టెంట్ , కంప్యూటర్ అసిస్టెంట్ 670 ఖాళీలు, అసిస్టెంట్ ఇంజనీర్లు 190 ఖాళీలు, ఎండోమెంట్ గ్రేడ్ 3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ 60 ఖాళీలు, హార్టికల్చర్ ఆఫీసర్ 39 ఖాళీలు, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ 4 ఖాళీలు, లెజిస్లేచర్ ఇంగ్లీష్ రిపోర్టర్ 10 ఖాళీలు, జూనియర్ లెక్చరర్ ఏపీఆర్ ఈ ఐ సొసైటీ 10 ఖాళీలు, డిగ్రీ లెక్చరర్ ఏపీఆర్ ఈఐ సొసైటీ 5ఖాళీలు, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఫారెస్ట్ సర్వీస్ 9 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

అభ్యర్ధుల వయోపరిమితికి సంబంధించి ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వుడ్ క్యాటగిరి అభ్యర్ధులకు గరిష్ట వయో పరిమితి పెంపుకు సంబంధించిన గతంలో ఇచ్చిన ఉత్తర్వుల కాలపరిమితి ముగిసింది. ఈనేపధ్యంలో తిరిగి గరిష్ట వయోపరిమితి పెంపు ఉత్తర్వుల పొడగింపుపై ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు ఉంచారు.

ఇదిలా ఉంటే అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి పదిశాతం కోటా అమలకు ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీచేసింది. ఈ కోటాలో పోస్టులు మిగిలిన పక్షంలో క్యారీ ఫార్వర్డ్ చేయాలా, చెయ్యకూడదా అనే విషయంపై స్పష్టతమోసం కమిషన్ ప్రభుత్వానికి లేఖరాసింది. రెండు అంశాలకు సంబంధించి ప్రభుత్వం నుండి స్పష్టత వచ్చిన వెంటనే నోటిఫికేషన్లు జారీచేసేందుకు చర్యలు చేపట్టనున్నారు.

జీవో 49 జారీ ద్వారా 1,180 పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ల జారీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే వయోపరిమితి, రిజర్వేషన్లు, ఈడబ్ల్యూఎస్ కోటా ఈ రెండు అంశాలపై ప్రభుత్వం నుండి తుది నిర్ణయంకోసం ఎదురు చూస్తుంది. అది వచ్చిన వెంటనే త్వరితగతిన నోటిఫికేషన్లను కమిషన్ జారీ చేయనుంది.