JOBS : బ్యాంకుల్లో క్లర్క్ పోస్టులకు కామన్ రిక్రూట్ మెంట్

అర్హతల విషయానికి వస్తే ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. వయసు20–28 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

JOBS : బ్యాంకుల్లో క్లర్క్ పోస్టులకు కామన్ రిక్రూట్ మెంట్

Jobs (2)

JOBS : ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌)2023–2024 సంవత్సరానికి సంబంధించి కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ చేపట్టనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్‌ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6035 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌209, తెలంగాణ99 ఉన్నాయి.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఇండియన్‌ బ్యాంకలలో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. వయసు20–28 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా పంపాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది 21జులై 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.ibps.in/ పరిశీలించగలరు.