ఆర్ఆర్‌బీలో జేఈ పోస్టులు.. జ‌న‌వ‌రి 2 నుంచే ద‌ర‌ఖాస్తు..

గ్రాడ్యువేట్‌ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు (ఆర్ ఆర్ బీ) మ‌రో కొత్త నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆర్ ఆర్ బీలో 14033 జూనియ‌ర్ ఇంజినీర్, డిపోట్ మెటేరియ‌ల్ సూపరిటెండెంట్, కెమిక‌ల్‌, మెట్రోలాజికల్ స‌హా ప‌లు విభాగాల్లో పోస్టుల‌కు ద‌రఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది.

  • Edited By: sreehari , December 29, 2018 / 07:25 AM IST
ఆర్ఆర్‌బీలో జేఈ పోస్టులు.. జ‌న‌వ‌రి 2 నుంచే ద‌ర‌ఖాస్తు..

గ్రాడ్యువేట్‌ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు (ఆర్ ఆర్ బీ) మ‌రో కొత్త నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆర్ ఆర్ బీలో 14033 జూనియ‌ర్ ఇంజినీర్, డిపోట్ మెటేరియ‌ల్ సూపరిటెండెంట్, కెమిక‌ల్‌, మెట్రోలాజికల్ స‌హా ప‌లు విభాగాల్లో పోస్టుల‌కు ద‌రఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది.

గ్రాడ్యువేట్‌ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు (ఆర్ ఆర్ బీ) మ‌రో కొత్త నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆర్ ఆర్ బీలో 14033 జూనియ‌ర్ ఇంజినీర్, డిపోట్ మెటేరియ‌ల్ సూపరిటెండెంట్, కెమిక‌ల్‌, మెట్రోలాజికల్ స‌హా ప‌లు విభాగాల్లో పోస్టుల‌కు ద‌రఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఆయా పోస్టుల‌కు కొత్త ఏడాది జ‌న‌వ‌రి 2 నుంచి ఆన్‌లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆన్‌లైన్ విధానంలో ద‌రఖాస్తు చేసుకునే ఈ పోస్టుల‌కు విద్యార్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

అన్ని పోస్టుల‌కు సంబంధించి జ‌న‌వ‌రి 2 నుంచి జ‌న‌వ‌రి 31 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వీలుంది. చివ‌రి తేదీ ఫిబ్ర‌వ‌రి 5 లోగా ఆన్‌లైన్లో ద‌ర‌ఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్ ఆర్ బీ 14033 పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు డిప్లోమా, డిగ్రీ విద్యార్హ‌త త‌ప్ప‌నిస‌రి. జ‌న‌వ‌రి 1, 2019 నాటికి అభ్య‌ర్థుల వ‌య‌స్సు 18 ఏళ్ల నుంచి 31 ఏళ్ల వ‌య‌స్సు ఉండాలి. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. రిజ‌ర్వేష‌న్ అభ్య‌ర్థులకు వ‌య‌స్సులో స‌డ‌లింపు ఉంటుంది. ఓబీసీ అభ్య‌ర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు 5 ఏళ్ల వ‌య‌స్సు స‌డ‌లింపు ఉంటుంది. పూర్తి వివ‌రాల కోసం.. indianrailways.gov.in లింక్ క్లిక్ చేయండి..