కరోనా ఎఫెక్ట్: ఆన్ లైన్ క్లాసెస్ కోసం తల్లిదండ్రులు తిప్పలు

  • Published By: Chandu 10tv ,Published On : July 4, 2020 / 12:01 PM IST
కరోనా ఎఫెక్ట్: ఆన్ లైన్ క్లాసెస్ కోసం తల్లిదండ్రులు తిప్పలు

ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల స్కూళ్లు కాలేజీలు ఎప్పుడు నుంచి తెచ్చుకుంటే కూడా ఎవరికీ తెలియదు. అందుకే పిల్లలను పాఠాలు మిస్సవకుండా చాలా వరకు ఆన్లైన్ క్లాసెస్ మొదలుపెట్టారు. అయితే ఇంకొన్ని పాఠశాలలు ఇంకా ఆన్లైన్ క్లాసులు మొదలు పెట్టలేదు… ఇపుడు ఆ కొన్ని పాఠశాలలు కూడా ఆన్లైన్ క్లాసెస్ కి సిద్ధంగా ఉండమని ప్రకటించాయి.

దీంతో కంప్యూటర్లు, లాప్టాప్, సెల్ఫోన్లకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఇంతకుముందు యూనిఫాంలు, పుస్తకాలు, కాలేజ్ బ్యాగులు, స్కూల్ బ్యాగులు అంటూ షాపుల ముందు క్యూ కట్టే తల్లిదండ్రులు…. ఇప్పుడు సెల్ ఫోన్లు, లాప్టాప్, హెడ్ ఫోన్ లు అంటూ క్యూ కడుతున్నారు.

ఈ దెబ్బతో అమీర్పేట్ లోని ఆదిత్య ట్రేడ్ సెంటర్ సికింద్రాబాద్లోని చినోయ్ ట్రేడ్ సెంటర్లు ఫుల్ బిజీ అయ్యాయి. హైదరాబాద్ ఒక్క చోట మాత్రమే కాదు వరంగల్, ఖమ్మం, విజయవాడ అన్ని ప్రాంతాల్లో ఇలాగే ఉంది.

ఇక ఆన్లైన్ క్లాస్ కి డేటా సరిపోక అందరూ ఫైబర్ నెట్ ఉపయోగిస్తున్నారు. మొన్నటి వరకూ కనెక్షన్ తీసుకోండి అంటూ తిరిగిన వాళ్లు… ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా పది, పదిహేను రోజులవరకు కనెక్షన్ ఇవ్వలేనంత బిజీగా అయిపోయారు.

Read:పేటీఎం నుంచి ఫ్లిప్ కార్ట్ : చైనా పెట్టబడులతో భారతీయ యాప్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా?