వరంగల్‌ ఐటీ Cyientలో 800 ఉద్యోగాలు ఆఫర్!

వరంగల్‌ ఐటీ Cyientలో 800 ఉద్యోగాలు ఆఫర్!

Cyient Hire 800 Its Warangal Rd Unit 23003

ప్రముఖ ఐటీ సంస్థ సైయెంట్ తమ డెవలప్ మెంట్ సెంటర్లను దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లో ఏర్పాటు చేసిన తమ R& D యూనిట్లో 800 మంది ఉద్యోగులను తీసుకోనుంది. ప్రస్తుతం 200 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్న ఈ యూనిట్లో మరికొంతమంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకోనుంది. గత ఏడాదిలో వ్యాపార మందగమనంతో నష్టాల్లో కూరుకుపోయిన ఇంజినీరింగ్ రీసెర్చ్, డెవలప్ మెంట్ కంపెనీ ఉద్యోగాల్లో కోత విధించింది.

వరంగల్ ఐటీ హబ్‌లో తమ యూనిట్ విస్తరించిన తర్వాత జూన్ త్రైమాసికంలో 70 వరకు ఉద్యోగాల్లో సైయెంట్ కోత విధించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో 185 ఉద్యోగాల్లో కోత విధించింది. సైయెంట్ తమ కంపెనీ విస్తరణలో వరంగల్ సెంటర్ అతిపెద్దదైన ప్రాంతంగా పేర్కొంది. ఇక్కడ ఐటీ పరిశ్రమను విస్తరించడం చాలా సంతోషంగా ఉంది. పర్యావరణ పరంగా ఎంతో అనుకూలమైన నగరంగా ప్రసిద్ధి చెందింది.

వ్యాపార పరంగా అభివృద్ధి సాధించడానికి ఎంతో అనువైన ప్రాంతం. ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లకు సపోర్ట్ అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం’ అని సైయెంట్ సీఈఓ క్రిష్ణా బోదాన్పు తెలిపారు. సైయెంట్ ఆర్ అండ్ టీ యూనిట్ సెంటర్ టెలికం కస్టమర్లకు సపోర్ట్ అందించనున్నట్టు ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా, సైయెంట్ ఐటీ పరిశ్రమతో పాటు ఇతర ఐటీ కంపెనీల్లో టెక్ మహీంద్ర సహా పలు ఐటీ సంస్థలు వరంగల్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. గత రెండేళ్లుగా తమ డెవలప్ మెంట్ సెంటర్లను టెక్ మహీంద్రా విస్తరిస్తోంది.

రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పట్టణాల్లో టైర్-11 లొకేషన్లలో తమ సంస్థలను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. సంప్రదాయపరంగా చూస్తే వరంగల్ విద్యాసంస్థలకు హబ్‌గా మారింది. దీంతో సోషల్, వైద్య మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు.. దేశవ్యాప్తంగా ప్రధాన పట్టణాలను కలిపే రోడ్డు, రైల్వే కనెక్టవిటీ సౌకర్యం కూడా ఉంది. అందుకే ఐటీ కంపెనీలు టైర్-11 నగరాల్లో తమ రంగాలను విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సోషల్ అండ్ పొలిటికల్ విశ్లేషకులు మంచాలా శ్రీనివాసరావు తెలిపారు.