ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఆధారంగా…10,12వ తరగతి విద్యార్ధులను పాస్ చేయాలి

ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఆధారంగా…10,12వ తరగతి విద్యార్ధులను పాస్ చేయాలి

కరోనావైరస్ సంక్షోభం మధ్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించలేకపోవడంతో….ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఆధారంగా 10,12వ తరగతి విద్యార్ధులను పాస్ చేయాలని ఢిల్లీ సర్కార్ కేంద్రప్రభుత్వాన్ని కోరింది. అంతేకాకుండా అన్ని తరగతులకు కనీసం 30 శాతం కోర్సు మెటీరియల్ ను తగ్గించాలని, JEE,NEET మరియు ఇతర ఉన్నత విద్యా పరీక్షలలో సిలబస్‌ను తగ్గించాలని కూడా కేంద్రాన్ని కోరినట్లు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా తెలిపారు.

ఇవాళ(ఏప్రిల్-28,2020) కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ మరియు దేశంలోని ఇతర రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో జరిగిన పాల్గొన్న తాను ఈ సూచనలు చేసినట్లు సోడియా తెలిపారు. CBSE 10, 12వ తరగతి…మిగిలిన ఎగ్జామ్స్ ను ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి 9, 11వ తరగతి ఎగ్జామ్స్ లో పిల్లలు పాస్ అయినందున… ఇంటర్నల్ ఎగ్జామ్స్ విద్యార్ధులు పాస్ కావాలని ఆయన తెలిపారు. వచ్చే ఏడాదికి మొత్తం సిలబస్‌ను కనీసం 30 శాతం తగ్గించాలి మరియు JEE,NEET నీట్ మరియు ఇతర ఉన్నత విద్యా సంస్థల ప్రవేశ పరీక్షలను కూడా తగ్గించిన సిలబస్ ఆధారంగా తీసుకోవాలని ఆయన అన్నారు.

అంతేకాకుండా ఢిల్లీ ప్రభుత్వం… ఉపాధ్యాయులు పిల్లలందరికీ ఆన్ ఎయిర్ క్లాసులు చెప్పేందుకు వీలుగా దూరదర్శన్ మరియు AIR FM లో ప్రతిరోజూ మూడు గంటలు కోరినట్లు మనీస్ సిసోడియా ట్వీట్ చేశారు.  COVID-19 మరియు పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన కార్యక్రమానికి సంబంధించిన అంశాలపై చర్చించడానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ మంగళవారం(ఏప్రిల్-28,2020) రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో సమావేశమయ్యారు. COVID-19 తో పోరాడటానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మధ్య… పాఠశాలల్లో వేసవి సెలవుల్లో కూడా విద్యార్థులకు మధ్యాహ్నా భోజనం అందించబడుతుందని పోఖ్రియాల్ చెప్పారు.

అంతకుముందు సోమవారం, విద్యార్థుల తల్లిదండ్రులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్ మాట్లాడారు. వివిధ అంశాలపై వారితో మాట్లాడారు. పుస్తకాల అలభ్యత మరియు బోర్డు పరీక్షలపై అనిశ్చితి, కరోనావైరస్ సంక్షోభం కారణంగా తలెత్తిన వివిధ సమస్యల గురించి విద్యార్థుల తల్లిదండ్రులతో ఆయన మాట్లాడారు. కరోనా కట్టడిలో భాగంగా విధించబడిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా మార్చి-16నుంచి యూనివర్శిటీలు,కాలేజీలు,స్కూల్స్ మూతపడిన విషయం తెలిసిందే.