JOBS : బెల్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ. 40,000, రెండవ సంవత్సరం నెలకు రూ. 45,000, మూడో ఏడాదిలో నెలకు రూ. 50,000, నాలుగవ సంవత్సరంలో రూ. 55,000 చెల్లిస్తారు.

JOBS : బెల్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

JOBS : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగుళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్) లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 23 ప్రాజెక్ట్ ఇంజనీర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్‌ విధానంలో భర్తీ చేయనున్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 32 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్‌, బీఎస్సీ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ. 40,000, రెండవ సంవత్సరం నెలకు రూ. 45,000, మూడో ఏడాదిలో నెలకు రూ. 50,000, నాలుగవ సంవత్సరంలో రూ. 55,000 చెల్లిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 4,2022ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకోసం వెబ్ సైట్ ; https://www.bel-india.in/ పరిశీలించగలరు.