JOBS : హైదరాబాద్ బీఎస్ఎన్ఎల్ లో అప్రెంటీస్ ఖాళీల భర్తీ |Filling of Apprentice Vacancies in BSNL, Hyderabad

JOBS : హైదరాబాద్ బీఎస్ఎన్ఎల్ లో అప్రెంటీస్ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక విధానికి సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీల అధారంగా ఎంపిక ఉంటుంది.

JOBS : హైదరాబాద్ బీఎస్ఎన్ఎల్ లో అప్రెంటీస్ ఖాళీల భర్తీ

JOBS : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) హైదరాబాద్ లో వివిధ విభాగాల్లో అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 68 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి , అర్హత ఉన్న అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, టెలికమ్యునికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఈఈఈ, కంప్యూటర్ ఇంజినీరింగ్ , ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక విధానికి సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీల అధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు స్టైఫండ్ గా 8000 నుండి 9000 వరకు చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేది జూన్ 22, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ http://portal.mhrdnats.gov.in/ పరిశీలించగలరు.

×