NCPOR JOBS : ఎన్ సీపీఓఆర్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి ఇంటర్మీడియట్ , సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, నర్సింగ్ లో బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.

NCPOR JOBS : ఎన్ సీపీఓఆర్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

Ncpor

NCPOR JOBS : భారత ప్రభుత్వ ఎర్త సైన్సెస్ మంత్రిత్వశాఖకు చెందిన గోవాలోని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రిసెర్ట్ (ఎన్ సీపీఓఆర్) పలు ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. ఈనోటిఫికేషన్ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మొత్తం 31 పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో వెహికిల్ మెకానిక్, వెహికిల్ ఎలక్ట్రీషియన్, జనరేటర్ మెకానిక్, వెల్డర్, కార్పెంటర్, టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబ్ టెన్నీషియన్లు, బుక్ కీపింగ్ స్టాఫ్, కుక్ తదితర ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి ఇంటర్మీడియట్ , సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, నర్సింగ్ లో బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధులను ఎంపిక విషయానికి వస్తే ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 51,657 నుండి 68,876 వేతనంగా చెల్లిస్తారు.

ఆసక్తిగల అభ్యర్ధులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; మినిస్టరీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, పృధ్వీభవన్, ఐఎండీ క్యాంపస్, ఇండియా హ్యాబిట్ సెంటర్, లోడీ రోడ్, న్యూ దిల్లీ-110003. దరఖాస్తులకు చివరి తేదిగా జులై 19, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.ncpor.res.in/ పరిశీలించగలరు.