DMHO Eluru Recruitment : ఏలూరు జిల్లా వైద్య,ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ |Filling of vacancies in Eluru District Medical and Health Department

DMHO Eluru Recruitment : ఏలూరు జిల్లా వైద్య,ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ

ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం పరిధిలో నేషనల్ హెల్త్ మిషన్ క్రింద ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

DMHO Eluru Recruitment : ఏలూరు జిల్లా వైద్య,ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ

DMHO Eluru Recruitment: ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం పరిధిలో నేషనల్ హెల్త్ మిషన్ క్రింద ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల వివరాలకు సంబంధించి మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, అడియోమెట్రీషియన్, శానిటరీ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 18 ఏళ్ల నుండి 42 సంవత్స రాల మధ్య ఉండాలి.

అభ్యర్ధుల విద్యార్హతల విషయానికి వస్తే ఆయా పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, బీఎస్సీ, ఎంబీబీఎస్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటుగా సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టరై ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విధానానికి సంబంధించి అనుభవం, ఇంటర్వ్యూ , రిజర్వేషన్ అధారంగా ఎంపిక ఉంటుంది.

అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆప్ లైన్ ద్వారా అందించాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖా కార్యాలయం, ఏలూరు జిల్లా , ఆంధ్రప్రదేశ్ అనే చిరునామాకు పంపాలి. దరఖాస్తులకు చివరితేదిగా మే 17, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://westgodavari.ap.gov.in/ పరిశీలించగలరు.

×