Hpcl Jobs : విశాఖ హెచ్ పిసిఎల్ రిఫైనరీలో ఖాళీల భర్తీ

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తులకు చివరి తేది మే 21, 2022గా నిర్ణయించారు. ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ ఆధారిత పరీక్ష అధారంగా ఉంటుంది.

Hpcl Jobs : విశాఖ హెచ్ పిసిఎల్ రిఫైనరీలో ఖాళీల భర్తీ

Hpcl Jobs (1)

Hpcl Jobs : విశాఖపట్నంలోని హిందూస్ధాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ రిఫైనరీలో టెన్నీషియన్ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 186 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పోస్టుల వివరాలకు సంబందించి ఆపరేషన్స్ టెన్నీషియన్ 94 పోస్టులు, బాయిలర్ టెన్నీషియన్ 18 పోస్టులు , మెయింటెనెన్స్ టెన్నీషియన్(మెకానికల్) 14 పోస్టులు, మెయింట్ నెన్స్ టెన్నీషియన్( ఎలక్ట్రికల్) 17 పోస్టులు, మెయింటెనెన్స్ టెక్నీషియన్(ఇన్ స్ట్రుమెంటేషన్) 9పోస్టులు, ల్యాబ్ అనలిస్ట్ 16 పోస్టులు, జూనియర్ ఫైర్ సేప్టీ ఇన్ స్పెక్టర్ 18 పోస్టులు, ఉన్నాయి.

అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి ఆపరేషన్స్ టెన్నీషియన్ పోస్టుకు అభ్యర్ధులు కెమికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా కలిగి ఉండాలి. బాయిలర్ టెన్నీషియన్స్ పోస్టులకు సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. మెయింటెనెన్స్ టెన్నీషియన్ (మెకానికల్) కు సంబంధించి అభ్యర్ధులు మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేసి ఉండాలి. మెయింటెనెన్స్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్స్) పోస్టులకు సంబంధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా కలిగి ఉండాలి.

మెయిటెనెన్స్ టెన్నీషియన్ (ఇన్స్ట్రుమెంటేషన్) పోస్టులకు గాను ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లేదా. ఇన్ స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్, లేదా ఇన్ స్ట్ర్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లో డిప్లొమా చేసి ఉండాలి. ల్యాబ్ అనలిస్ట్ పోస్టులకు సంబంధించి బిఎస్సీలో 60శాతం మార్కులు లేదంటే ఎమ్మెస్సీలో 60 శాతం మార్కులు అర్హతగా నిర్ణయించారు. జూనియర్ ఫూర్ సేప్టీ ఇన్ స్పెక్టర్ కు సబంధించి హెచ్ ఎమ్ వి లైసెన్స్ తోపాటు సైన్స్ గ్యాడ్యేయేట్ షన్ లో 40శాతం మార్కులు వచ్చి ఉన్న వారు అర్హులు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తులకు చివరి తేది మే 21, 2022గా నిర్ణయించారు. ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ ఆధారిత పరీక్ష అధారంగా ఉంటుంది. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ WWW.HINDUSTANPETROLEUM.COM పరిశీలించగరలు.