CDAC Recruitment : సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

ఖాళీల వివరాలకు సంబంధించి ప్రాజెక్ట్ అసోసియేట్ 30 పోస్టులు ఉన్నాయి. ప్రాజెక్ట్ ఇంజినీర్ 250 పోస్టులు, ప్రాజెక్ట్ మేనేజర్: 50 పోస్టులు, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్: 200 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి 30 నుండి 56 సంవత్సరాలలోపు ఉండాలి.

CDAC Recruitment : సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

CDAC Recruitment : పుణెలోని సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడ్యాక్)లో వివిధ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 530 ప్రాజెక్ట్ అసోసియేట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఇంజినీరింగ్‌లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఖాళీల వివరాలకు సంబంధించి ప్రాజెక్ట్ అసోసియేట్ 30 పోస్టులు ఉన్నాయి. ప్రాజెక్ట్ ఇంజినీర్ 250 పోస్టులు, ప్రాజెక్ట్ మేనేజర్: 50 పోస్టులు, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్: 200 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి 30 నుండి 56 సంవత్సరాలలోపు ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 20, 2022 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి జీతభత్యాలుగా ఏడాదికి రూ.8.49 లక్షలు – రూ.14 లక్షలు చెల్లిస్తారు.

అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://careers.cdac.in/ పరిశీలించగలరు.