TSVU Recruitment : తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో ఒప్పంద ఖాళీల భర్తీ

అర్హతలున్నవారు అక్టోబర్‌ 10, 2022వ తేదీన ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

TSVU Recruitment : తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో ఒప్పంద ఖాళీల భర్తీ

Filling up of contract vacancies in Telangana Veterinary University

TSVU Recruitment : హైదరాబాద్‌లోని పీవీ నర్సింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వెటర్నరీ, వెటర్నరీ మెడిసిన్‌, ప్లాంట్‌ ప్రొటెక్షన్‌, ఫిషరీస్‌ విభాగాల్లో సబ్జెక్ట్‌ మ్యాటర్‌ స్పెషలిస్టు పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే వెటర్నరీ సైన్స్‌లో ఐదేళ్ల బ్యాచిలర్స్‌ డిగ్రీ, అగ్రికల్చర్‌లో నాలుగేళ్ల బ్యాచిలర్స్‌ డిగ్రీ,ఫిషరీస్‌ సైన్స్‌లో నాలుగేళ్ల బ్యాచిలర్స్‌ డిగ్రీ, సంబంధిత స్పెషలైజేషన్లలో మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధుల ఎంపిక నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.56,100లతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు.

ఈ అర్హతలున్నవారు అక్టోబర్‌ 10, 2022వ తేదీన ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిన చిరునామా : అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, PV నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, రాజేంద్రనగర్, హైదరాబాద్ – 500 062. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://tsvu.nic.in/ పరిశీలించగలరు.