GDS Recruitment : పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాచ్‌పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్‌వ్రాంచ్‌పోస్ట మాస్ట్రర్(ఏబీపీఎం). డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

GDS Recruitment : దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎన్) ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40,889 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2480, తెలంగాణలో 1206 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైనవారు. రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్‌లకు ప్రోత్సాహం లభిస్తుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాచ్‌పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్‌వ్రాంచ్‌పోస్ట మాస్ట్రర్(ఏబీపీఎం). డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. విధులు నిర్వర్తించడానికి ల్యావ్‌టావ్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది.
దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎంపిక విధానం విషయానికి వస్తే అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం నియామకాలు చేపడతారు. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 16, 2023 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; Indiapostgdsonline.gov.in పరిశీంచగలరు.