Job Vacancies : రైల్ టెల్ కార్పోరేషన్ పరిధిలో ఉద్యోగ ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించివారు అర్హులు. దీంతోపాటుగా అభ్యర్ధులకు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. రాత పరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
Job Vacancies : కేంద్ర ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 18 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న వాటిలో ప్రాజెక్ట్ మేనేజర్, నెట్వర్క్ ఎక్స్పర్ట్, సర్వర్ ఎక్స్పర్ట్, స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, ఈఎంఎస్ ఎన్ఎంఎస్ ఎక్స్పర్ట్, క్లౌడ్ అండ్ వర్చువలైజేషన్ ఎక్స్పర్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించివారు అర్హులు. దీంతోపాటుగా అభ్యర్ధులకు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. రాత పరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఆగస్టు 17 , 2022లోపు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: టెరిటరీ మేనేజర్ భోపాల్, ప్లాట్ నెం. 17, రఘునాథ్ నగర్ షాపురా ఠాణా దగ్గర, బవడియాకాలం, భోపాల్,మధ్యప్రదేశ్ – 462039. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.railtelindia.com/ పరిశీలించగలరు.