SC ST Backlog Posts : ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎస్సీ,ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి 5వ తరగతి, 7వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈడీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆయా పోస్టులను బట్టి తెలుగు/ ఇంగ్లిష్‌ భాషలో చదవడం, రాయడం తెలిసి ఉండాలి. నియామక ప్రక్రియ పూర్తిగా జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారానే జరుగుతుంది.

SC ST Backlog Posts : ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎస్సీ,ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ

AP SC ST Backlog Posts :

SC ST Backlog Posts : ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి గుంటూరు జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ)లో ఎస్సీ/ ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 54 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన దివ్యాంగుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

భర్తీ చేయనున్న పోస్టులకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 2, జూనియర్ స్టెనో పోస్టులు 1, టైపిస్ట్ పోస్టులు 3, మాట్రాన్ కమ్ స్టోర్ కీపర్ పోస్టులు 1, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 8, మెసెంజర్ పోస్టులు 2, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు 1, ల్యాబ్ అటెండర్ పోస్టులు 1, వర్క్‌షాప్ అటెండర్ పోస్టులు 1, స్కిల్డ్‌ వర్క్‌ మ్యాన్‌ పోస్టులు 1, ఫిషర్ మ్యాన్ పోస్టులు 1, శానిటరీ (పబ్లిక్ హెల్త్) మేస్త్రీ పోస్టులు 1, వాచ్‌మ్యాన్ పోస్టులు 9, వాటర్‌మ్యాన్ పోస్టులు 1, స్వీపర్ పోస్టులు 3, పబ్లిక్ హెల్త్ వర్కర్ పోస్టులు 12 వీటితోపాటుగా గ్యాంగ్ మజ్దూర్ పోస్టులు 2, డ్రెయిన్ క్లీనర్ పోస్టులు 1, కళాసి పోస్టులు 1, హోల్ టైమ్ సర్వెంట్ పోస్టులు 1, లస్కర్ పోస్టులు 1 ఉన్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి 5వ తరగతి, 7వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈడీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆయా పోస్టులను బట్టి తెలుగు/ ఇంగ్లిష్‌ భాషలో చదవడం, రాయడం తెలిసి ఉండాలి. నియామక ప్రక్రియ పూర్తిగా జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారానే జరుగుతుంది.

అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే విద్యార్హతల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధుల వయసు జులై 1, 2022వ తేదీనాటికి 18 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 11, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం వెబ్ సైట్ ; https://www.gunturap.in/2023/ పరిశీలించగలరు.