SSC MTS Recruitment : కేంద్రప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీ

పదో తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 27 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. హవల్దార్‌ పోస్టులకు నిర్ణీత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

SSC MTS Recruitment : కేంద్రప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీ

SSC MTS Recruitment : కేంద్రప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ , హవల్దార్‌ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ దరఖాస్తులు కోరుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12,523 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఎంటీఎస్‌ 11,994, హవల్దార్‌ 529 చొప్పున ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి ఉత్తీర్ణులైన ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

పదో తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 27 ఏళ్ళ మధ్య వయస్సు కలిగి ఉండాలి. హవల్దార్‌ పోస్టులకు నిర్ణీత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ ఏడాది పరీక్ష విధానంలో ఎస్‌ఎస్‌సీ కొన్ని మార్పులు చేసింది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను 270 మార్కులకు నిర్వహిస్తున్నది. మొత్తం రెండు పేపర్లు ఉంటాయి.

రిజిస్ట్రేషన్‌ ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరితేదీ ఫిబ్రవరి 19, 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.ssc.nic.in పరిశీలించగలరు.