VIMS Recruitment : విశాఖపట్నంలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో పలు తాత్కాలిక ఉద్యోగ ఖాళీల భర్తీ

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును బట్టి పదోతరగతి, సంబంధిత విభాగాల్లో ఇంటర్/డిగ్రీ/డిప్లొమా/పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 42 యేళ్లకు మించరాదు. అకడమిక్‌ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల తుది ఎంపిక ఉంటుంది.

VIMS Recruitment : విశాఖపట్నంలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో పలు తాత్కాలిక ఉద్యోగ ఖాళీల భర్తీ

Institute of Medical Sciences, Visakhapatnam

VIMS Recruitment : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (విమ్స్)లో ఒప్పంద, అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 69 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. భర్తీ చేయనున్న ఖాళీలలో ఈసీజీ టెక్నీషియన్, స్పీచ్ థెరపిస్ట్, ఫార్మాసిస్ట్ తదితర పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

పోస్టుల వివరాలను పరిశీలిస్తే ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు: స్పీచ్ థెరపిస్ట్ పోస్టులు 2ఖాళీలు, ఫార్మాసిస్ట్ పోస్టులు 1, ఫిజియోథెరపిస్ట్ పోస్టులు 2, ప్యాకింగ్ బాయ్స్ పోస్టులు 2, డ్రెస్సర్స్ పోస్టులు 1,స్ట్రెచర్ బేరర్ పోస్టులు 6, అనస్థీషియా టెక్నీషియన్ పోస్టులు 13,ఈఈజీ టెక్నీషియన్ పోస్టులు 1, ఎంఎన్‌వో పోస్టులు 13, ఎఫ్‌ఎన్‌వో పోస్టులు 14, ఓటీ టెక్నీషియన్ పోస్టులు 13ఖాళీలు ఉన్నాయి.

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును బట్టి పదోతరగతి, సంబంధిత విభాగాల్లో ఇంటర్/డిగ్రీ/డిప్లొమా/పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 42 యేళ్లకు మించరాదు. అకడమిక్‌ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.15,000ల నుంచి రూ.121,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయం, విశాఖపట్నం,
AP.దరఖాస్తులను సెప్టెంబర్ 10, 2022వ తేదీలోపు పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; visakhapatnam.ap.gov.in పరిశీలించగలరు.