APPSC : నిరుద్యోగులకు శుభవార్త.. ఏపిలో త్వరలో గ్రూప్ 1,2 నోటిఫికేషన్లు

ఈనోటిఫికేషన్ ద్వారా 190 అసిస్టెంట్ ఇంజనీర్, 670 జూనియర్ అసిస్టెంట్ల ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నారు. ఇప్పటికే నోటిఫికేషన్లకు సంబంధించిన కసరత్తు పూర్తయింది. ఇదే విషయాన్ని ఏపీపీఎస్స

APPSC : నిరుద్యోగులకు శుభవార్త.. ఏపిలో త్వరలో గ్రూప్ 1,2 నోటిఫికేషన్లు

Appsc

APPSC : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో గ్రూప్ 1,2 పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ జారీచేయనుంది. ఈనోటిఫికేషన్ ద్వారా 190 అసిస్టెంట్ ఇంజనీర్, 670 జూనియర్ అసిస్టెంట్ల ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నారు. ఇప్పటికే నోటిఫికేషన్లకు సంబంధించిన కసరత్తు పూర్తయింది. ఇదే విషయాన్ని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్ ఆర్ ఆంజనేయులు స్పష్టం చేశారు. అభ్యర్ధుల వయోపరిమితి పెంపుతోపాటు ఇతర అంశాలపై ప్రభుత్వం నుండి సకాలంలో అదేశాలు రాకపోవటంతో ఇప్పటి వరకు నోటిఫికేషన్ల జారీలో జాప్యం జరుగుతూ వచ్చినట్లు ఆయన తెలిపారు.

కోవిడ్ నేపధ్యంలో గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబు పత్రాలను డిజిటల్‌ విధానంలో మూల్యాంకనం చేశామన్న ఆయన మాన్యువల్‌గా దిద్ది మూడు మాసాల్లో ఫలితాలను విడుదల చేస్తామని చెప్పారు. డిజిటల్‌ మూల్యాంకన విధానాన్ని నోటిఫికేషన్‌లో పేర్కొనక పోవడాన్ని హైకోర్టు తప్పుబట్టినందున, న్యాయస్థానం తీర్పును గౌరవిస్తూ మాన్యువల్ విధానంలోనే మూల్యాంకనం చేయనున్నట్లు పేర్కొన్నారు.

డిజిటల్ మ్యూల్యాంకన విధానం వల్ల అభ్యర్థులెవరికీ నష్టం ఉందన్న పీఎస్ఆర్, ఉద్యోగాలకు ఎంపికకాని అభ్యర్థులు డిజిటల్‌ మూల్యాంకనాన్ని తప్పుబట్టడం సరికాదన్నారు. గ్రూప్‌-1 అయినా, యూపీఎ్‌ససీ అయినా పరీక్ష రోజు ఎవరు బాగా రాస్తే వారే ఎంపిక అవుతారని, ఒకసారి ఫెయిలైన వాళ్లు మరోసారి రాసుకోవచ్చని అన్నారు. నియామకాల్లో కమిషన్‌ పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో ఎనిమిది వాజ్యాలు దాఖలయ్యాయన్నారు.