Diwali Gift : త్వరలో పెరగనున్న ఉద్యోగుల జీతాలు! 

  • Published By: sreehari ,Published On : October 28, 2019 / 11:45 AM IST
Diwali Gift : త్వరలో పెరగనున్న ఉద్యోగుల జీతాలు! 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. దీపావళి పండుగ గిఫ్ట్‌గా ఎన్డీఏ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. 7వ సెంట్రల్ పే కమిషన్ (CPC)లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు త్వరలో పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగుల జీతాల పెంపు విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దాదాపు 50లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షన్ దారులకు ప్రయోజనం చేకూరనుంది.

అందిన రిపోర్టు ప్రకారం.. వచ్చే నవంబర్ నెలలో జీతాల పెంపునకు సంబంధించి తుది నిర్ణయం వెల్లడి కానుంది. ఈ విషయంలో ఇప్పటివరకూ కేంద్రం ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల DAను 12శాతం నుంచి 17శాతానికి పెంచగా.. ఈ ఏడాది జూలై నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. తమ కనీస జీతాలతో పాటు ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పెంచాలని ఎప్పుటినుంచో ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్టు ఓ రిపోర్టు తెలిపింది.

ఇటీవల కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల DAను అత్యధికంగా పెంచడం ఇదేనని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కనీస జీతం రూ.18వేలకు కేంద్రం పెంచింది. కానీ, ఉద్యోగులు వారి రూ.26వేలు, ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ 2.57 సార్ల నుంచి 3.68 సార్లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్రం ఉద్యోగుల డిమాండ్ లను పరిగణనలోకి తీసుకోలేదు.