10th, ITI పాసైతే చాలు : HCLలో ఉద్యోగాలు

10th, ITI పాసైతే చాలు : HCLలో ఉద్యోగాలు

టెన్త్, ఐటీఐ పాసైన ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (HCL)లో వివిధ విభాగాల్లో ఖాళీలకు దరఖాస్తు కోరుతోంది. పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారికి హెచ్ సీఎల్ రిక్రూట్ చేసుకుంటోంది.

10th, ITI పాసైతే చాలు : HCLలో ఉద్యోగాలు

టెన్త్, ఐటీఐ పాసైన ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (HCL)లో వివిధ విభాగాల్లో ఖాళీలకు దరఖాస్తు కోరుతోంది. పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారికి హెచ్ సీఎల్ రిక్రూట్ చేసుకుంటోంది.

టెన్త్, ఐటీఐ పాసైన ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (HCL)లో వివిధ విభాగాల్లో ఖాళీలకు దరఖాస్తు కోరుతోంది. పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారికి హెచ్ సీఎల్ రిక్రూట్ చేసుకుంటోంది. దరఖాస్తు ప్ర్రక్రియ ప్రారంభం కాగా.. మార్చి 30, 2019 దరఖాస్తుకు  ఆఖరి తేదీగా ప్రకటించింది.
Read Also : వాట్సాప్‌లో కొత్త ఫీచర్ : ఫేక్ న్యూస్‌ను పట్టేస్తుంది

క్వాలిఫికేషన్ ఆధారంగా మెరిట్ సాధించిన వారికి పోస్టింగ్ ఇవ్వనున్నారు. మెరిట్ సాధించిన అభ్యర్థులు ఫిజికల్ ఫిట్ నెస్ టెస్టులో కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు హెచ్ సీఎల్ అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలి. 

దరఖాస్తు ప్రక్రియ : 
దరఖాస్తును పూర్తి చేసిన తర్వాత ఎకాడమిక్, టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లను జత చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, అఫడవిట్ (ఒరిజినల్), పాస్ పోర్ట్ సైజు ఫొటో ఒకటి జత చేసి స్పీడ్ పోస్టు లేదా రిజిస్ట్రడ్ పోస్టు ద్వారా చీఫ్ మేనేజర్ (హెచ్ఆర్) సీహెచ్ ఆర్ డీ, కేత్రీ చాపర్ కాంప్లెక్స్, కేత్రి నగర్ చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. మార్చి 30లోగా అభ్యర్థుల దరఖాస్తు అందాలి.

అభ్యర్థులు పంపే దరఖాస్తు ఎన్వోలప్ కవర్ పై  అప్లికేషన్ ఫర్ ట్రేడ్ అప్రెంటెస్ ( Trade Name) తప్పక మెన్షన్ చేసి ఉండాలి. అభ్యర్థులు వెబ్ సైట్.. www.apprenticeship.gov.in లో రిజిస్ట్రర్ చేసుకోవాల్సి ఉంటుంది. హెచ్ సీఎల్, కేసీసీ అప్లికేషన్ ఫాంతో కలిపి రిజిస్ట్రేషన్ ఐడీ ఫ్రూప్ సబ్మిట్ చేయాలి. ఇందులో సీరియల్ నెంబర్ 06 అని తప్పక మెన్షన్ చేయాలి. 

అర్హతలు : 
* బ్లాస్టర్ (మైన్స్) పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు మెట్రిక్ (10వ తరగతి) పాసై ఉండాలి.
* అన్ని పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు టెన్త్, ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* 2016లో ఐటీఐ పూర్తి చేసినవారే దరఖాస్తు చేయాలి.
Read Also : హైటెక్ సిటీకి శుభవార్త: రేపు..ఎల్లుండి ఎప్పుడైనా మెట్రో రావొచ్చు

×