IBPS లో 645 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు… దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

  • Published By: Chandu 10tv ,Published On : November 2, 2020 / 12:11 PM IST
IBPS లో 645 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు… దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

IBPS SO 2020 notification:
బ్యాంకింగ్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఓ శుభవార్త. ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సన‌ల్ (IBPS‌) నుంచి వివిధ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న‌ స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ (SO) ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. విభాగాల వారీగా ఐటీ ఆఫీస‌ర్‌, అగ్రిక‌ల్చర‌ల్ ఆఫీస‌ర్‌, రాజ్‌భాష‌ అధికారి, లా ఆఫీస‌ర్‌, హెచ్ఆర్‌, మార్కెటింగ్ ఆఫీస‌ర్ పోస్టులను ఈ నోటిఫికషేన్ కింద భర్తీ చేయనుంది.



ఇందులో మెుత్తం 645 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల కోసం నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్దులు ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు.



ఈ నోటిఫికేషన్ ద్వారా మెుత్తం 11 బ్యాంకులో నియామక ప్రక్రియ చేపట్టనుంది. అవి కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్ సిస్ బ్యాంక్, సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా‌, యూకో బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియ‌న్ బ్యాంక్‌, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర‌లో ఖాళీలు ఉన్నాయి.
https://10tv.in/ibps-clerk-x-recrutiment-2020-apply-for-online-link-starts-from-tommorrow-on-october-23/
విభాగాల వారీగా ఖాళీలు :
ఐటీ ఆఫీస‌ర్‌ – 20
అగ్రిక‌ల్చర‌ల్ ఫీల్డ్ ఆఫీస‌ర్‌ – 485
మార్కెటింగ్ ఆఫీస‌ర్ ‌- 60
లా ఆఫీస‌ర్‌ – 50
HR/ప‌ర్స‌న‌ల్ ఆఫీస‌ర్‌ – 7
రాజ్‌భాష‌ అధికారి – 25



విద్యార్హతలు :
> ఐటీ ఆఫీస‌ర్‌ : అభ్యర్దులు బీటెక్ పూర్తి చేసి ఉండాలి. కంప్యూట‌ర్ సైన్స్/ కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

> అగ్రిక‌ల్చ‌ర్ ఫీల్డ్ ఆఫీస‌ర్‌ : అభ్యర్ధులు అగ్రిక‌ల్చ‌ర్‌లో 4 సంవత్సరాలు డిగ్రీ చేసి ఉండాలి.

> రాజ్‌భాష అధికారి పోస్టు : అభ్యర్ధులు ఇంగ్లిష్, హిందీ స‌బ్జెక్టుల్లో డిగ్రీ చేసి పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

> లా ఆఫీస‌ర్ పోస్టు : అభ్యర్దులు ఎల్ఎల్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.

> HR/ప‌ర్స‌న‌ల్ మేనేజ్‌మెంట్ ఉద్యోగుల కోసం అభ్యర్దులు 2 సంవత్సరాల పర్సనల్ మేనేజ్ మెంట్ డిప్లామా/ ఇండ‌స్ట్రియ‌ల్ రిలేష‌న్స్‌లో పీజీ పూర్తి చేసి ఉండాలి.

> మార్కెటింగ్ ఆఫీస‌ర్ : అభ్యర్ధులు ఎంబీఏ మార్కెటింగ్/ఎమ్మెమ్మెస్ మార్కెటింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి : అభ్యర్ధుల వయసు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వుడ్ అభ్యర్ధులకు వయసులో సడలింపులు వర్తిస్తాయి.



ఎంపిక విధానం: అభ్యర్దులను ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్ష, ఇంట‌ర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్దులకు రూ.850 చెల్లించాలి.SC, ST, PWD అభ్యర్దులు రూ.175 చెల్లించాలి.



ముఖ్య తేదీలు :
ద‌ర‌ఖాస్తులు ప్రారంభ తేదీ : న‌వంబ‌ర్ 2, 2020.
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ : న‌వంబ‌ర్ 23,2020.
ప్రిలిమిన‌రీ పరీక్ష తేదీలు : ‌డిసెంబ‌ర్ 26,2020 – డిసెంబర్ 27,2020.
మెయిన్స్ ప‌రీక్ష‌ తేదీ : జ‌న‌వ‌రి 24, 2021.