IIT Madras : ఐఐటీ మద్రాస్ బీఎస్ ఆన్ లైన్ డిగ్రీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

అర్హులైన విద్యార్థులకు 100% వరకు స్కాలర్‌షిప్‌లను అందించనున్నారు. ఈ కోర్సులో అడ్మిషన్లు చేపట్టడానికి అర్హత పరీక్షను నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 111 నగరాల్లో 116 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. ఈ డేటా సైన్స్ ప్రోగ్రామ్ సెప్టెంబర్ 2022 టర్మ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 19గా నిర్ణయించారు.

IIT Madras : ఐఐటీ మద్రాస్ బీఎస్ ఆన్ లైన్ డిగ్రీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

IIT Madras : అగ్రశేణి సంస్థ ఐఐటీ మద్రాస్, బీఎస్ డిగ్రీ కోర్సును ఆఫర్ చేస్తోంది. డేటా సైన్స్ అండ్ అప్లికేషన్‌లలో నాలుగు సంవత్సరాల BS డిగ్రీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విద్యార్థుల నుండి ఈకోర్సుకు డిమాండ్‌ ఉండటంతో అందుబాటులోకి తీసుకువచ్చారు.

దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలకు సంబంధించి ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా ఈ ఆన్‌లైన్ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తారు.10వ తరగతిలో ఇంగ్లీష్, గణితం చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎలాంటి వయోపరిమితి నిబంధనలు లేవు. తరగతులు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. బీఎస్ డీగ్రీలో భాగంగా 8 నెలల అప్రెంటిస్‌షిప్ లేదా పరిశోధనా సంస్థలతో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. బీఎస్ డిగ్రీ ఆన్‌లైన్ కోర్సు కోసం జేఈఈ స్కోర్ అవసరం లేదు.

అర్హులైన విద్యార్థులకు 100% వరకు స్కాలర్‌షిప్‌లను అందించనున్నారు. ఈ కోర్సులో అడ్మిషన్లు చేపట్టడానికి అర్హత పరీక్షను నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 111 నగరాల్లో 116 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. ఈ డేటా సైన్స్ ప్రోగ్రామ్ సెప్టెంబర్ 2022 టర్మ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 19గా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు onlinedegree.iitm.ac.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.