IIT మాస్టర్ ప్లాన్ : వీక్ స్టూడెంట్స్‌కు.. ఇంజినీరింగ్‌లో BSc మూడేళ్ల డిగ్రీ

దేశీయ ప్రీమియర్ ఇంజినీరింగ్ విద్యాసంస్థలో ఒకటైన ఇండియన్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IITs) మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది.

  • Published By: sreehari ,Published On : September 26, 2019 / 10:33 AM IST
IIT మాస్టర్ ప్లాన్ : వీక్ స్టూడెంట్స్‌కు.. ఇంజినీరింగ్‌లో BSc మూడేళ్ల డిగ్రీ

దేశీయ ప్రీమియర్ ఇంజినీరింగ్ విద్యాసంస్థలో ఒకటైన ఇండియన్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IITs) మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది.

దేశీయ ప్రీమియర్ ఇంజినీరింగ్ విద్యాసంస్థలో ఒకటైన ఇండియన్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IITs) మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. చదువులో వెనుకబడిన ఇంజినీరింగ్ విద్యార్థులను విద్యాసంవత్సరం ముగియక ముందే తప్పించనుంది. విద్యలో వీక్ గా ఉన్న విద్యార్థులను మూడేళ్లకే పరిమితం చేయనుంది. మూడేళ్ల తర్వాత ఇంజినీరింగ్ కోర్సులో B.Sc డిగ్రీ పట్టా ఇచ్చి బయటకు పంపనుంది. దీనికి సంబంధించి ప్రతిపాదనలపై చర్చించేందుకు సెప్టెంబర్ 27 (శుక్రవారం) రోజున ఐఐటీ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించనుంది. HRD మంత్రి అధ్యక్షతన ఈ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. ఈ ప్రతిపాదనకు సంబంధించి అన్ని 23 విద్యాసంస్థల సభ్యులతో చర్చించి తుది నిర్ణయాన్ని వెల్లడించనుంది. 

ప్రస్తుతం.. అన్ని ఐఐటీ కాలేజీల్లో UG కోర్సు చదువుతున్న విద్యార్థులు 8 సెమిస్టర్లు లేదా 4ఏళ్లు పూర్తి చేస్తే బీటెక్ డిగ్రీ పట్టా పొందవచ్చు. అలాగే వీక్ గ్రేడ్ విద్యార్థులను మాత్రం మధ్యలోనే ఆపేయనుంది. 2019లో పార్లమెంటులో HRD మంత్రిత్వ శాఖ అందించిన డేటా ప్రకారం.. వివిధ ఐఐటీ విద్యా సంస్థల్లో గత రెండేళ్లలో బీటెక్, పీజీ చదివిన 2,461 మంది విద్యార్థులను తప్పించింది. వీరిలో విద్యలో వెనుకబడిన విద్యార్థులే ఎక్కువమంది ఉన్నారు. ఈ ఏడాదిలో IIT-కాన్పూర్ వీక్ గ్రేడ్ కింద 18 విద్యార్థులను ఇంటికి పంపేసింది. అందులో సగానికి పైగా బీటెక్ విద్యార్థులే ఉన్నారు. ఇలాంటి విద్యార్థుల కోసం IITలో ఆరు సెమిస్టర్ల తర్వాత ఎగ్జిట్ ఆప్షన్ కల్పించాలని హెచ్ ఆర్ డీ మినిస్టరీ ప్రతిపాదించింది. 

కౌన్సిల్ అజెండా ప్రకారం.. కనీస విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఉండి.. విద్యపరంగా వెనుకబడిన విద్యార్థులను రెండో సెమిస్టర్ తర్వాత లేదా మూడేళ్ల తర్వాత BSc (ఇంజినీరింగ్) ఎంచుకునేలా అనుమతించేందుకు తమ ప్రతిపాదనను ఆమోదించాలని హెచ్‌ఆర్‌డీ ఐఐటీ సంస్థలను సూచించింది. ఈ ప్రతిపాదనను ఒకవేళ ఆమోదిస్తే.. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఐఐటీ విద్యా సంస్థలు ఈ విధానాన్ని అమలు చేయనున్నాయి. 

ఏడాదికి రెండు సార్లు జరిగే JEE (Main) ఎంట్రన్స్ పరీక్షకు కనీసం 9 లక్షల మంది విద్యార్థులు పోటీ పడుతున్నట్టు అంచనా వేస్తే.. వారిలో 13వేల 500మందికి మాత్రమే IIT సీటు లభిస్తుంది. ఐఐటి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులను, చైర్‌పర్సన్‌ను ఎంపిక చేయడానికి అధికారం ఇచ్చే ప్రతిపాదనను కూడా కౌన్సిల్ పరిశీలిస్తుంది. ప్రస్తుతం, HRD మంత్రిత్వ శాఖ వారిని నియమిస్తుంది. ఈ స్వయంప్రతిపత్తి కొత్త IIM చట్టం ప్రకారం IIMలకు మంజూరు చేసింది. ఐఐటి డైరెక్టర్లు, ఎజెండా ప్రకారం.. ప్రభుత్వం ఎంపిక చేయడాన్ని కొనసాగిస్తుంది. ఏదేమైనా, ఐఐటి కౌన్సిల్ ఆమోదం కాకుండా, చివరకు ఐఐటిలకు అధికారం ఇవ్వడానికి ఐఐటి చట్టం కూడా సవరించాల్సి ఉంటుంది.