Indian Coast Guard : ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

అభ్యర్థులను స్క్రీనింగ్‌ టెస్ట్‌, సైకలాజికల్‌ టెస్ట్‌, గ్రూప్‌ టాస్క్‌, ఇంటర్వ్యూ చివరికి మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు గడువు 7 సెప్టెంబర్ 2022తో ముగియనుంది.

Indian Coast Guard : ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

Indian Coast Guard

Indian Coast Guard : ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ శాఖల్లో గ్రూప్‌ ఎ గెజిటెడ్‌ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 71 పోస్టులను భర్తీ చేస్తున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో జనరల్ డ్యూటీ జీడీ& కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఎస్‌ఎస్‌ఏ 50 ఖాళీలు, టెక్నికల్ మెకానికల్ & టెక్నికల్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ 20 ఖాళీలు, లా ఎంట్రీ 1 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా మ్యాథ్స్‌, ఫిజిక్స్‌లో ఇంటర్మీడియట్‌, ఇంజనీరింగ్‌, లా, డిప్లొమా, కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ ఉత్తీర్ణత పొంది ఉండాలి.

అభ్యర్థులు రూ. 250 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. అభ్యర్థులను స్క్రీనింగ్‌ టెస్ట్‌, సైకలాజికల్‌ టెస్ట్‌, గ్రూప్‌ టాస్క్‌, ఇంటర్వ్యూ మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు గడువు 7 సెప్టెంబర్ 2022తో ముగియనుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://joinindiancoastguard.gov.in/పరిశీలించగలరు.