ఇండియన్ కోస్ట్ గార్డ్ లో నావిక్ పోస్టులు

  • Published By: veegamteam ,Published On : October 16, 2019 / 08:07 AM IST
ఇండియన్ కోస్ట్ గార్డ్ లో నావిక్ పోస్టులు

భార‌త ర‌క్షణ మంత్రిత్వ శాఖ‌ ఆధ్వర్యంలోని ఇండియ‌న్ కోస్ట్ గార్డు నావిక్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. అంతేకాదు ఈ పోస్టులకు పురుష అభ్యర్ధులు మాత్రమే అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వయసు: 
అభ్యర్ధులు 18 నుంచి 22 ఏళ్లు మించకూడదు. SC, ST అభ్యర్ధులకు వయోపరిమితి ఉంటుంది. 

ఎంపిక విధానం:
అభ్యర్ధులను రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్టు, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తున్నారు. 

ముఖ్యమైన తేదిలు: 
దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 30, 2019.

దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 8, 2019.

Read Also: దరఖాస్తు చేసుకోండి: బాసరలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు