IOCL Recruitment : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగ ఖాళీల భర్తీ
ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత సాధించిన వారికి గ్రేడ్-7 పోస్టులకైతే నెలకు రూ.37,500ల నుంచి 1,45,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. గ్రేడ్-3 పోస్టులకు నెలకు రూ.26,000ల నుంచి రూ.90,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

IOCL Recruitment : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 35 గ్రేడ్-III, గ్రేడ్-VII పోస్టుల భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరగతితోపాటు, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్ వర్క్‌మ్యాన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డ్రాఫ్ట్‌మెన్ సివిల్ ట్రేడ్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, సర్వేయర్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తదితర ట్రేడుల్లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత సాధించిన వారికి గ్రేడ్-7 పోస్టులకైతే నెలకు రూ.37,500ల నుంచి 1,45,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. గ్రేడ్-3 పోస్టులకు నెలకు రూ.26,000ల నుంచి రూ.90,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. అర్హతలున్నవారు ఆన్లైన్ విధానంలో డిసెంబర్ 26, 2022వ తేదీ లోగా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://iocl.com/ పరిశీలించగలరు.