ఇన్ఫోసిస్ ఆఫర్: ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ-కోర్సులు 

ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేయడం ఉద్యోగాల కోసం తిరగడం.. ఇంటర్వ్యూల్లో నెగ్గలేక వెనుతిరగడం చాలామంది విద్యార్థులకు ఎదురువుతున్న అనుభవమే.

  • Published By: sreehari ,Published On : February 16, 2019 / 08:40 AM IST
ఇన్ఫోసిస్ ఆఫర్: ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ-కోర్సులు 

ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేయడం ఉద్యోగాల కోసం తిరగడం.. ఇంటర్వ్యూల్లో నెగ్గలేక వెనుతిరగడం చాలామంది విద్యార్థులకు ఎదురువుతున్న అనుభవమే.

ఇంజినీరింగ్ కోర్సులో చేరిన విద్యార్థులు సరైన స్కిల్స్ లేని కారణంగా కోర్సు పూర్తయ్యాక ఉద్యోగం పొందడం కష్టంగా మారుతోంది. ఆటలు పాటలు గా ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల వేటలో పడుతున్నారు. ఇంటర్వ్యూలో సరైన స్కిల్స్ ను ప్రదర్శించలేక చేతులారా కెరీర్ ను రిస్క్ లో పడేసుకుంటున్నారు. ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేయడం ఉద్యోగాల కోసం తిరగడం.. ఇంటర్వ్యూల్లో నెగ్గలేక వెనుతిరగడం చాలామంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎదురువుతున్న అనుభవమే. ఎందుకంటే.. ఇంజినీరింగ్ ప్రెషర్స్ కు ఐటీ కంపెనీలు ఆశించే స్థాయిలో స్కిల్స్ లేకపోవడమే అసలు కారణం… ఇంజినీరింగ్ ఫ్రెషర్స్ ను చాలా కంపెనీలు తీసుకునేందుకు సిద్ధంగా లేని పరిస్థితి. అందుకే ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం ఇన్ఫోసిస్ కంపెనీ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ ఫాంను తీసుకొచ్చింది. ముఖ్యంగా ఇంజినీరింగ్ థర్డ్, ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థులపైనే ఇన్ఫోసిస్ దృష్టిసారించింది. 

టాలెంట్ ప్రెషర్ గ్రాడ్యువేట్స్ ను ప్రోత్సహించే దిశగా ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఇన్ఫైటీక్యూ (InfyTQ) (Talent quotient) యాప్ ను మైసూర్ లో ఆవిష్కరించింది. ఈ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో300 కాలేజీలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ యాప్ ద్వారా ఇంజినీరింగ్ విద్యార్థులు తమ పేరును నమోదు చేసుకొని తమ కోర్సుకు అవసరమైన స్కిల్స్ ను డెవలప్ చేసుకునేందుకు లైవ్ ప్రాజెక్ట్ లకు హాజరవుతున్నారు. కొన్ని కోర్సులకు ఇన్ఫోసిస్ సర్టిఫికేట్ కూడా అందిస్తోంది.

ప్రాక్టికల్ గా ఎక్స్ పీరియస్ సాధించడం వల్ల సకాలంలో విద్యార్థులు ఉద్యోగాలు సాధించేందుకు వీలు పడుతుంది. ప్రత్యేకించి టైర్-2 విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థుల్లోనే ఈ పరిస్థితి ఉంది. వీరిలో 4.8 శాతం విద్యార్థులు మాత్రమే లాజికల్  ప్రొగ్రామ్స్ ను కరెక్ట్ గా ప్రజెంట్ చేయగలరని ఓ అధ్యయనం తెలిపింది. 1.4 శాతం మాత్రమే కరెక్ట్, సమర్థవంతంగా కోడ్ ప్రజెంట్ చేయగలగుతున్నారని తెలిపింది.

ఈ డిజిటల్ కోర్సులను విద్యార్థులు, కాలేజీలకు ఇన్ఫోసిస్ ఉచితంగా ఆఫర్ చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులకు డిటిటల్ ప్లాట్ ఫాం నుంచి లెర్నింగ్, గుడ్ ఎక్స్ పీరియన్స్ ఉండేలా ట్రైనింగ్ ఇవ్వనున్నట్టు ఇన్ఫోసిస్ సీఓఓ ప్రవీన్ రాం తెలిపారు. సర్టిఫికేషన్ కోర్సులు కావడంతో లేటెస్ట్ డెవలప్ మెంట్స్ పై అవగాహన ఉంటుందని, ఐటీ సంస్థలు కూడా తమకు అవసరమైన స్కిల్స్ ఉన్న విద్యార్థులను రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రారంభ దశలో ఉన్న ఇన్ఫోసిస్ ప్రవేశపెట్టిన యాప్.. వెబ్ వర్షన్, ఆండ్రాయిడ్ యాప్ అందుబాటులో ఉందని, త్వరలో iOS యాప్ ను కూడా ప్రవేశపెట్టనున్నట్టు ప్రవీన్ తెలిపారు.