డబ్బులిస్తే రాసి పెడతారు..న్యూ మదీనా కాలేజీ బాగోతం

  • Published By: madhu ,Published On : March 19, 2020 / 02:44 AM IST
డబ్బులిస్తే రాసి పెడతారు..న్యూ మదీనా కాలేజీ బాగోతం

విద్యార్థులు పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో..కొంతమంది మోసగాళ్లు తెరపైకి వచ్చారు. కొన్ని కాలేజీలు వారితో చేతులు కలిపి మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు. హైదరాబాద్ నగరంలోని టోలీచౌకి సూర్యనగర్ కాలనీలో ఉన్న న్యూ మదీనా జూనియర్ కాలేజీ (సెంటర్ కోడ్ – 60237) గుట్టు రట్టైంది. పశ్చిమ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన దాడుల్లో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. కాలేజీ ప్రిన్స్ పాల్, ముగ్గురు పరిపాలన విభాగం సిబ్బంది, ఆరుగురు విద్యార్థులను పట్టుకున్నారు. 

Also Read | యూరిన్ ఆపుకుంటున్నారా.. బ్లాడర్ జర భద్రం!!

అసలేం ఏం జరిగింది : –
పరీక్షల నిర్వాహణకు సంబంధించి..అనుమతి పొందిన కాలేజీల్లో న్యూ మదీనా జూనియర్ కాలేజీ ఒకటి. పరీక్షలు రాస్తున్న విద్యార్థులను మచ్చిక చేసుకొనేందుకు కాలేజీ ప్రిన్స్ పాల్ షోయబ్ ప్రయత్నించాడు. కచ్చితంగా పాస్ చేయిస్తానని, ఒక్కో సబ్జెక్టుకు రూ. 5 నుంచి రూ. 8 వేలు ఇవ్వాలని విద్యార్థులకు చెప్పాడు. దీంతో కొంతమంది స్టూడెంట్స్ అడిగినట్లుగా చేశారు. 

ఇలా చేశారు : – 
ప్రతి పశ్నాపత్రంతో జత చేసి ఉండే..ఆన్సర్ షీట్స్ బుక్ లెట్‌ను ముందు రోజే మార్చేశారు. OMR షీట్‌కు డమ్మీ జవాబు పత్రాన్ని జత చేశారు. ఈ కాలేజీ ప్రిన్స్ పాల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న వారికి OMR షీట్స్‌తో డమ్మీ బుక్ లెట్స్ ఇస్తున్నాడు. అసలు బుక్ లెట్స్‌ను కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందిలో కొంతమందికి ఇచ్చి పుస్తకాల్లో చూసి రాయిస్తున్నాడు. ఆయా సబ్జెక్టుల ప్రశ్నాపత్రాలు వీరికి ఇస్తున్నాడు. పరీక్ష ముగిశాక..అసలు బుక్ లెట్స్‌ను ఒప్పందం చేసుకున్న విద్యార్థులకు అందించింది..వాటిని OMR షీట్‌కు జత చేసి..దానిపై బుక్ లెట్ నెంబర్ వేయిస్తున్నాడు. 

పక్కా సమాచారంతో దాడులు : – 
టాస్క్ ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. వెంటనే న్యూ మదీనా కాలేజీపై దాడి చేసింది. ఈ సమయంలో బుక్ లెట్స్‌లో పరీక్షలు రాస్తున్న ముగ్గురు సిబ్బందితో పాటు..ప్రిన్స్ పాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆధారాలను బట్టి ఒప్పందం చేసుకున్న ఆరుగురు విద్యార్థులను పట్టుకున్నారు. వీరిలో ఇద్దరు కామర్స్, నలుగురు కెమిస్ట్రీ పరీక్షలు రాయిస్తున్నారని గుర్తించారు. మరో ఇద్దరు విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో న్యూ మదీనా జూనియర్ కాలేజీ యాజమాన్యానికి ఇంటర్ బోర్డు షోకాజ్ నోటీసు జారీ చేసింది. 

Read More : ఢిల్లీలో కలకలం : కరోనా అనుమానిత రోగి ఆత్మహత్య