ఇంటర్నేషనల్ వర్సిటీల ఆఫర్..  ఫ్రీ-ఆన్‌లైన్ కోర్సులు మీకోసం..

  • Published By: sreehari ,Published On : April 16, 2020 / 02:04 AM IST
ఇంటర్నేషనల్ వర్సిటీల ఆఫర్..  ఫ్రీ-ఆన్‌లైన్ కోర్సులు మీకోసం..

కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విద్యాసంస్థలు మూతపడ్డాయి. విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  ప్రపంచ శ్రేణి యూనివర్సిటీలు సహా పలు వర్సిటీలు ఉచితంగా ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తున్నాయి. హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్, డ్యూక్, మిచిగాన్‌ సహా అంతర్జాతీయంగా పలు యూనివర్సిటీలు విద్యార్థులకు ఉచితంగా ఆన్‌లైన్‌ కోర్సులను అందించేందుకు ముందుకొచ్చాయి. మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సు విధానంలో ఈ కోర్సులను అందిస్తోంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఆయా వర్సిటీలు సర్టిఫికెట్లు, క్రెడిట్లు అందించనున్నాయి. 

స్టాన్‌ఫోర్డ్, జార్జియాటెక్, యేల్, డ్యూక్, మిచిగాన్‌ వంటి అనేక వర్సిటీలలొ దాదాపు 178 మూక్స్‌ సర్టిఫికేషన్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఉచితంగా ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్‌ కోర్సులు అందించనున్న వర్సిటీలు మొత్తం 50 వరకు ఉన్నాయి. పెన్, జార్జియాటెక్, జాన్స్‌ హాకిన్స్, కాల్‌టెక్, డ్యూక్, ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ యూనివర్శిటీలు ఉన్నాయి. 180 రోజుల్లో కోర్సు పూర్తిచేసేలా ప్రణాళికలు ఉన్నాయి. ఈ సర్టిఫికేషన్‌ కోర్సులకు 2020 మే ఆఖరు వరకే మాత్రమే అవకాశం ఉంది. గూగుల్, అమెజాన్‌ కంపెనీలు కూడా ఫ్రీ-ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సుల వ్యవధి వారంలో  5 నుంచి 10 గంటలవరకు అందిస్తున్నాయి. 

ఫ్రీ ఆన్‌లైన్‌ కోర్సుల్లో కంప్యూటర్‌ సైన్సు, బిజినెస్‌, ఇంజనీరింగ్‌, హెల్త్‌ అండ్‌ మెడిసిన్‌, హ్యుమానిటీస్‌ ముఖ్యమైన కేటగిరీలుగా చేర్చాయి. అలాగే డేటా సైన్స్‌.. పర్సనల్‌ డెవలప్‌మెంట్‌, ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ కూడా అందిస్తున్నాయి. ప్రోగ్రామింగ్‌ విషయానికి వస్తే.. మేథమెటిక్స్‌, సైన్స్‌, సోషల్‌ సైన్సెస్‌ కూడా అందిస్తున్నాయి. పలు స్పెషలైజ్డ్‌ కోర్సులు కూడా అందిస్తున్నాయి. ఉచితంగా అందించే ఈ ఆన్ లైన్ కోర్సులకు సమాచారం కోసం https://www.classcentral.com/report/coursera-free-certificate-covid-19 వెబ్‌సైట్‌ విజిట్ చేయండి.