ISRO : ఇస్రో యువికా 2022 శిక్షణ దరఖాస్తుల ఆహ్వానం

రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీగా ఏప్రిల్‌ 10, 2022ను నిర్ణయించారు. అర్హుల జాబితాను ఏప్రిల్ 20వ తేదిన విడుదల చేస్తారు. ఎంపికైన విద్యార్ధులకు వసతి కల్పించడంతోపాటు రవాణా ఛార్జీలు, భోజన ఖర్చులను ఇస్రో చెల్లిస్తోంది.

ISRO : ఇస్రో యువికా 2022 శిక్షణ దరఖాస్తుల ఆహ్వానం

Isro Uvika 2022

ISRO : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సంస్ధ స్పేస్ టెక్నాలజీ, సైన్సు అప్లికేషన్లపై ప్రాధమిక జ్ణానాన్ని అందించేందుకు యువ విజ్ణాన కార్యక్రమం (యువికా)2022 పేరుతో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ శిక్షణకు 9వ తరగతి చదువుతున్న గ్రామీణ విద్యార్థులకు ప్రాధాన్యత కల్పించనున్నారు. ఈ ఏడాది తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్ధులు యువికా-2022 శిక్షణకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

ఎనిమిదో తరగతిలో సాధించిన మార్కులు, పాఠశాల, జిల్లా, రాష్ట్ర జాతీయ స్థాయిలో గడిచిన మూడేళ్లలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలు సైన్స్‌ ఫెయిర్‌, ఒలింపియాడ్, సైన్సు పోటీల్లో బహుమతులు పొందిన ప్రతిభావంతులు, గుర్తింపు పొందిన అసోసియేషన్లు నిర్వహించిన క్రీడా పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారు, ఎన్‌సీసీ, ఎన్‌.ఎస్‌.ఎస్‌., సౌట్స్‌ అండ్‌ గైడ్స్‌లో సభ్యత్వం ఉన్నవారికి ప్రత్యేక వెయిటేజీ ఉంటుంది. ఆన్‌లైన్‌ క్విజ్‌లో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. జాతీయస్థాయిలో ఎంపికైన అభ్యర్థులకు మే 16 నుంచి 28వ తేదీ వరకు ఆయా కేంద్రాల్లో 13 రోజుల పాటు శిక్షణ ఇస్తారు.

రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీగా ఏప్రిల్‌ 10, 2022ను నిర్ణయించారు. అర్హుల జాబితాను ఏప్రిల్ 20వ తేదిన విడుదల చేస్తారు. ఎంపికైన విద్యార్ధులకు వసతి కల్పించడంతోపాటు రవాణా ఛార్జీలు, భోజన ఖర్చులను ఇస్రో చెల్లిస్తోంది. ఎంపికైన అభ్యర్థ్ధితోపాటు తల్లిదండ్రుల్లో ఒకరు లేదా గైడ్‌ టీచర్‌కు కూడా ప్రయాణ భత్యం చెల్లిస్తారు. శిక్షణ అనంతరం శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లి అక్కడి విశేషాలను వివరిస్తారు. పరిశోధనలపై విద్యార్థులకు ప్రేరణ కలిగించడమే ధ్యేయంగా ఇస్రో క్యాచ్‌ దెమ్‌ యంగ్‌ ప్రణాళికతో దీనిని చేపట్టింది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో అర్హులైన వారు www. isro.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి తమ మెయిల్‌ ఐడితో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.