IOCL లో ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాలు

  • Published By: Chandu 10tv ,Published On : November 6, 2020 / 02:28 PM IST
IOCL లో ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాలు

IOCL apprentice posts : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) లో అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. విభాగాల వారీగా టెక్నికల్, నాన్ టెక్నికల్ ట్రేడ్ లో ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 482 ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్దులు ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవటం కోసం అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు.



రీజియన్ వారీగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతం కవర్ అయ్యే సదరన్ రీజియన్ పైప్ లైన్స్(SRPL), వెస్టర్న్ రీజియన్ పైప్ లైన్స్(WRPL), నార్తర్న్ రీజియన్ పైప్ లైన్స్(NRPL) , ఈస్టర్న్ రీజియన్ పైప్ లైన్స్(ERPL), సౌత్ ఈస్టర్న్ రీజియన్ పైప్ లైన్స్ (SERPL) వంటి ఐదు రీజియన్ ప్రాంతాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. అభ్యర్దులు గమనించాల్సిన విషయం ఏమిటంటే.. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు నిర్ణయించబడింది.



రీజియన్ వారీగా ఖాళీలు :
వెస్ట్రర్న్ రీజియన్ పైప్ లైన్స్ :
గుజరాత్ – 90
రాజస్ధాన్ – 46
పశ్చిమ బెంగాల్ – 44
బీహార్ – 36
అస్సాం – 31
ఉత్తర ప్రదేశ్ – 18

సౌత్ ఈస్టర్న్ రీజియన్ పైప్ లైన్స్ :
ఒడిసా – 51
ఛత్తీస్ ఘడ్ – 6
జార్ఖండ్ – 3



నార్తర్న్ రీజియన్ పైప్ లైన్స్ :
హార్యానా – 43
పంజాబ్ – 16
ఢిల్లీ – 21
ఉత్తర ప్రదేశ్ – 24
ఉత్తారాఖండ్ -6
రాజస్తాన్ – 3
హిమాచల్ ప్రదేశ్ – 3

సదరన్ రీజియన్ పైప్ లైన్స్ :
కర్ణాటక – 3
తమిళనాడు – 32
ఆంధ్రప్రదేశ్ – 6



విద్యార్హతలు :
టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులకు మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల ఫుల్ టైమ్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులకు సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు మాత్రం ఇంటర్ పాసైతే చాలు.

వయసు : అభ్యర్ధుల వయసు 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వడ్ అభ్యర్దులకు వయసులో సడలింపులు వర్తిస్తాయి.



ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : నవంబర్ 4, 2020.
దరఖాస్తు చివరి తేదీ : నవంబర్ 22, 2020.
పరీక్ష తేదీ : డిసెంబర్ 6, 2020.