ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్(IOCL) లో అప్రెంటిస్ ఉద్యోగాలు

  • Published By: veegamteam ,Published On : February 26, 2020 / 09:37 AM IST
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్(IOCL) లో  అప్రెంటిస్ ఉద్యోగాలు

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్(IOCL) లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా టెక్నీషియన్, నాన్ టెక్నికల్, టెక్నికల్ ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 500 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విభాగాల వారీగా ఖాళీలు :
టెక్నీషియన్ అప్రెంటిస్ – 265
టెక్నికల్ ట్రేడ్ అప్రెంటిస్ – 99
నాన్ టెక్నికల్ అప్రెంటిస్ – 136

విద్యార్హత : అభ్యర్దులు ఇంజనీరింగ్ డిప్లామా ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.

వయసు : అభ్యర్దుల వయసు 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపులు వర్తిస్తాయి.

ఎంపికా విధానం : అభ్యర్దులను కంప్యూటర్ బేస్ టెస్ట్, ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.

ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 22, 2020.
దరఖాస్తు చివరి తేదీ : మార్చి 20, 2020.
పరీక్ష తేదీ : మార్చి 29, 2020.