Ugc Net : యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ధరఖాస్తుకు ఆఖరుతేది ఎప్పుడంటే?

ఇక పరీక్ష నిర్వాహణ విధానం విషయానికి వస్తే ఇది కంప్యూటర్ బేస్డ్ పరీక్ష. అబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్లో 50 ప్రశ్నలు ఇస్తారు. రీజనింగ్ ఎబిలిటీ, రీడి

Ugc Net : యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ధరఖాస్తుకు ఆఖరుతేది ఎప్పుడంటే?

Ugc Net 2021

Ugc Net : యూనివర్శిటీలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం ఉద్దేశించిన యూజీసీ నెట్ అర్హత పరీక్ష జూన్ 2021 నోటిఫికేషన్ విడుదలైంది. కోవిడ్ కారణంగా 2020 డిసెంబరులో జరగాల్సిన అర్హత పరీక్షను వాయిదా వేశారు. ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా రెండు సెషన్లు కలిపి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షను నిర్వహించనుంది. 2020 సెషన్ లో ధరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ప్రస్తుత సెషన్ లో ధరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత పరీక్ష రాసేందుకు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి హ్యుమానిటీస్, సోషల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్ సైన్స్ తదితర స్పెషలైజేషన్లతో మాస్టర్స్ డిగ్రీ, తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. అందులో కనీసం 55 శాతం మార్కులు తప్పనిసరి, ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్నవారు ధరఖాస్తు చేసుకునేందుకు అర్హులే. అభ్యర్ధుల వయస్సు అక్టోబరు 1 నాటికి 31 ఏళ్ళు లోపు ఉండాలి. అసిస్టెంట్ ఫ్రోఫెసర్ కు గరిష్ట వయోపరిమితి నిబంధనలేదు.

ఇక పరీక్ష నిర్వాహణ విధానం విషయానికి వస్తే ఇది కంప్యూటర్ బేస్డ్ పరీక్ష. అబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్లో 50 ప్రశ్నలు ఇస్తారు. రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైవర్టెంట్ దింకింగ్, జనరల్ అవేర్ నెస్, టీచింగ్, రీసెర్చ్ అప్టిట్యూడ్ అంశాల్లో అభ్యర్ధి ప్రతిభను గుర్తించేలా ప్రశ్నలు ఇస్తారు. రెండో పేపరు అభ్యర్ధి ఐచ్చికంగా ఎంచుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇందులో 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు కేటాయిస్తారు. మొత్తం 300 మార్కులకు 3గంటల పాటు పరీక్ష కొనసాగుతుంది.

ఆన్ లైన్ విధానంలో ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ధరఖాస్తుకు చివరి తేది సెప్టెంబరు 5, 2021. పరీక్ష నిర్వాహణకు సంబంధించి అక్టోబరు 6వ తేది నుండి 11వ తేది వరకు జరుగుతాయి. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; ugcnet.nic.in