ITBP Job Vacancies : ఐటీబీపీలో ఉద్యోగ ఖాళీల భర్తీ

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,400 నుంచి రూ. 1,12,400 వరకు చెల్లిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు 15 సెప్టెంబర్ 2022 ఆఖరి తేదిగా నిర్ణయించారు.

ITBP Job Vacancies : ఐటీబీపీలో ఉద్యోగ ఖాళీల భర్తీ

ITBP job

ITBP Job Vacancies : ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)లో పలు ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ-స్టాఫ్‌ నర్స్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 18 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ-స్టాఫ్‌ నర్స్‌) ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్, సెంట్రల్, స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేయబడిన జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,400 నుంచి రూ. 1,12,400 వరకు చెల్లిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు 15 సెప్టెంబర్ 2022 ఆఖరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.itbpolice.nic.in/ పరిశీలించగలరు.