JEE Advanced 2021 Results : చరిత్ర సృష్టించిన మృదుల్ అగర్వాల్

జేఈఈ ఫలితాల్లో జైపూర్​కు చెందిన 18 ఏళ్ల మృదుల్ అగర్వాల్ చరిత్ర సృష్టించాడు. అత్యధిక మార్కులతో ఆలిండియా టాపర్ గా నిలిచాడు. 360 మార్కులకు 348 మార్కులు సాధించాడు.

JEE Advanced 2021 Results : చరిత్ర సృష్టించిన మృదుల్ అగర్వాల్

JEE Advanced 2021 Results : ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్‌టీఐ లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021 ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీ ఖరగ్‌పూర్ రిజల్ట్స్ ను విడుదల చేసింది. జేఈఈ ఫలితాల్లో జైపూర్​కు చెందిన 18 ఏళ్ల మృదుల్ అగర్వాల్ చరిత్ర సృష్టించాడు. అత్యధిక మార్కులతో ఆలిండియా టాపర్ గా నిలిచాడు. 360 మార్కులకు 348 మార్కులు సాధించాడు.

హిస్టరీ క్రియేట్ చేసిన మృదుల్​..
మృదుల్​ గత పదేళ్ల JEE అడ్వాన్స్‌డ్ పరీక్షలో అత్యధిక పర్సంటైల్ సాధించిన విద్యార్థిగా రికార్డు సృష్టించాడు. మృదుల్ మొత్తం 360 మార్కులకు 348 మార్కులు సాధించి 96.66% సాధించాడు. 2011 నుంచి ఇప్పటివరకు JEE అడ్వాన్స్‌డ్ పరీక్షలో విద్యార్థులు సాధించిన అత్యధిక పర్సంటైల్ ఇదే. JEE మెయిన్ 2021 లో మృదుల్ సెషన్ 1, సెషన్ 2 లలో 300 స్కోర్‌తో 100 శాతం స్కోర్ సాధించాడు. గతేడాది జేఈఈ అడ్వాన్స్​డ్​ టాపర్ చిరాగ్ ఫాలర్ 396 మార్కులకు 352 మార్కులతో 88.88 శాతం మార్కులు సాధించాడు.

Eyesight : మెరుగైన కంటి చూపుకోసం… తీసుకోవాల్సినవి ఏంటంటే!..

”మార్చి సెషన్‌లో సెంటు శాతం మార్కులు సాధించిన తర్వాత, నేను ఏప్రిల్ సెషన్‌కు హాజరుకాలేదు. కానీ మే సెషన్‌ను అడ్వాన్స్‌డ్ పరీక్ష కోసం ప్రాక్టీస్ టెస్ట్‌గా తీసుకున్నాను. సెషన్‌లు ఆలస్యం అయినందున, ఇది JEE అడ్వాన్స్‌డ్ కోసం సిద్ధం కావడానికి నాకు ఎక్కువ సమయం ఇచ్చింది” అని మృదుల్ అన్నాడు.

”నాకు గూగుల్ CEO సుందర్ పిచాయ్ స్ఫూర్తి. అతను నా ఆరాధ్యుడు, అతను టెక్ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకడు. అతను కూడా నా దారిలోనే నడిచాడు. అతను తక్కువ మార్గాలతో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు. నా కెరీర్‌లో అదే సాధించాలని నేను కోరుకుంటున్నాను” అని మృదుల్ అన్నాడు. భారత్ లో టెక్ డెవలప్‌మెంట్ రంగంలో చెప్పుకోదగిన సహకారం అందించాలని మృదుల్ ఆకాంక్షించాడు.

Vitamin B12 : విటమిన్ బి12 వల్ల కలిగే ప్రయోజనం తెలుసా?..

మృదుల్ తండ్రి ప్రదీప్ అగర్వాల్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తారు. అతడి తల్లి గృహిణి. తను సాధించిన ఘనతకు తన తల్లిదండ్రులే కారణం అన్నాడు. ఏనాడు కూడా తన తల్లిదండ్రులు తన మీద ఒత్తిడి తేలేదని చెప్పాడు.

“దీనిని సాధించడంలో స్థిరత్వం నాకు సహాయపడింది. స్వీయ ప్రేరణ కీలకం. టీచర్లు, తల్లిదండ్రులు, స్నేహితులు మిమ్మల్ని ప్రేరేపించగలరు. కానీ ఎవరూ దీన్ని 24X7 చేయలేరు. ప్రతి తప్పుకు నన్ను నేను కొట్టుకునే బదులు నా ప్రిపరేషన్ వ్యూహంలోని సమస్యలను డీబగ్ చేయడంపై దృష్టి పెట్టాను” అని మృదుల్ అన్నాడు.

”నా తదుపరి లక్ష్యం IIT బొంబాయిలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (CSE) లో BTech లో చేరడం. ఈ సంవత్సరం, IIT ఖరగ్‌పూర్ టాప్ -100 JEE అడ్వాన్స్‌డ్ ర్యాంకర్లకు పూర్తి స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. కానీ అది నా మనసు మార్చలేదు. నేను గుంపు, పర్యావరణం గురించి నా సీనియర్లను సంప్రదించాను. నాకు IIT బొంబాయి సరిగ్గా సరిపోతుందని నిర్ణయించాను” అని మృదుల్ అన్నాడు.

”JEE మెయిన్ ప్రిపరేషన్ సమయంలో ఇనిస్టిట్యూట్ స్టడీ మెటీరియల్స్, NCERT పుస్తకాలతో పాటు ఆశిష్ అరోరా రాసిన ఫిజిక్స్ గెలాక్సీ, నీరజ్ కుమార్ రాసిన ఫిజికల్ కెమిస్ట్రీలో అడ్వాన్స్‌డ్ ప్రాబ్లమ్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎలిమెంటరీ ప్రాబ్లమ్స్ వంటి పుస్తకాలు చదివాను. జేఈఈ (మెయిన్, అడ్వాన్స్) కోసం చౌహాన్, వికె జైస్వాల్ రాసిన ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ పుస్తకాలు చదివాడు” అని మృదుల్ వివరించాడు.

Insulin : మోతాదుకు మించి ఇన్సులిన్ ప్రమాదకరమే..!

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021 ఫలితాల్లో బాలికల విభాగంలో కావ్య చోప్రా టాపర్​గా నిలిచింది. ఢిల్లీకి చెందిన కావ్య 360 కి 286 మార్కులు సాధించింది.

కేటగిరీల వారీగా టాపర్లు..

ఆలిండియా ర్యాంక్ 1 : మృదుల్ అగర్వాల్, OBC ర్యాంక్ 1 : ప్రియాంశు యాదవ్

EWS ర్యాంక్ 1 : రామస్వామి సంతోష్ రెడ్డి, SC ర్యాంక్ 1 : నందిగామ నిఖిల్

ST ర్యాంక్ 1 : బిజిలి ప్రచితన్ వర్మ, PwD ర్యాంక్ 1 : అర్ణవ్ జైదీప్ కల్గుత్కర్

EWS-PwD ర్యాంక్ 1 : యువరాజ్ సింగ్, OBC- PwD Rank 1 : గొర్లె కృష్ణ చైతన్య

SC-PwD ర్యాంక్ 1 : రాజ్ కుమార్, ST-PwD ర్యాంక్ 1 : రవి శంకర్ మీనా.