జేఈఈ అడ్వాన్స్‌డ్, సీఏ పరీక్షలు వాయిదా..

  • Published By: veegamteam ,Published On : March 11, 2019 / 10:52 AM IST
జేఈఈ అడ్వాన్స్‌డ్, సీఏ పరీక్షలు వాయిదా..

కేంద్ర ఎన్నికల సంఘం 2019 సార్వత్రిక ఎన్నికల తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు మొత్తం 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మే నెలలో నిర్వహించనున్న JEE మెయిన్2, JEE అడ్వాన్స్‌డ్, CA పరీక్ష తేదీలపై సందిగ్ధత నెలకొంది. షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 7 నుంచి 20 వరకు JEE మెయిన్ పరీక్షలు, మే 19న JEE అడ్వాన్స్‌డ్ పరీక్ష, మే 3 నుంచి 6 వరకు CA ఫౌండేషన్ కోర్సు పరీక్షలు, మే 6 నుంచి 12 వరకు CA ఫైనల్ పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. 

అయితే ఏప్రిల్ 11న తొలివిడత పోలింగ్ , ఏప్రిల్ 18న రెండో విడత పోలింగ్ ఉండటంతో ఏప్రిల్ 7 నుంచి 20 వరకు నిర్వహించనున్న JEE మెయిన్ పరీక్షలను కూడా వాయిదావేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఇక ఎన్నికల షెడ్యూలులో భాగంగా ఏడో విడద ఎన్నికల పోలింగ్‌ను ఏప్రిల్ 19న నిర్వహించనున్నారు. అయితే అదేరోజు JEE అడ్వాన్స్‌డ్ పరీక్షను నిర్వహించనున్నట్లు IIT రూర్కీ ప్రకటించింది. దీంతో ఎన్నికల రోజే పరీక్ష రావడంతో.. JEE అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీని కూడా వాయిదా వేసే అవకాశముంది.