మే 27న JEE అడ్వాన్స్ డ్ ఎగ్జామ్

మే 27న JEE అడ్వాన్స్ డ్ ఎగ్జామ్

ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షను మే 27వ తేదీ జరుపనున్నారు.

మే 27న JEE అడ్వాన్స్ డ్ ఎగ్జామ్

ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షను మే 27వ తేదీ జరుపనున్నారు.

హైదరాబాద్ : జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష వాయిదా పడింది. ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షను మే 27వ తేదీ జరుపనున్నారు. ఈమేరకు ఐఐటీ రూర్కీ మార్చి 19 మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ పరీక్షను మే 19వ తేదీన నిర్వహిస్తామని గత నవంబర్ లోనే ప్రకటించారు. అయితే అదే రోజు లోక్ సభ ఎన్నికల తుది విడత పోలింగ్ ఉండటంతో అడ్వాన్స్ డ్ పరీక్షను మే 27వ తేదీన నిర్వహించాలని నిర్ణయించింది. జేఈఈ మెయిన్ లో వచ్చిన మార్కుల ఆధారంగా కటాఫ్ నిర్ణయించి దేశ వ్యాప్తంగా 2.24 లక్ష మందికి అడ్వాన్స్ డ్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తారు.
 

×