CDAC Jobs : సీడ్యాక్ లో ఉద్యోగాల భర్తీ |Job replacement at CDAC

CDAC Jobs : సీడ్యాక్ లో ఉద్యోగాల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే స్పెషలైజేషన్లో బీఈ, బీటెక్, ఎంసీఏ, పీజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.

CDAC Jobs : సీడ్యాక్ లో ఉద్యోగాల భర్తీ

CDAC Jobs : భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్ లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన మొత్తం 101 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలకు సంబంధించి ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు 42, ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులు 24, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు 27, ప్రాజెక్ట్ లీడ్ పోస్టులు 1, మాడ్యుల్ లీడ్ పోస్టులు 4, నాలెడ్జ్ పార్ట్నర్ పోస్టులు 1, ప్రోగ్రాం మేనేజర్ పోస్టులు 2 ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే స్పెషలైజేషన్లో బీఈ, బీటెక్, ఎంసీఏ, పీజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజకు సంబంధించి జనరల్ అభ్యర్ధులకు 500 రూ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినాహాయింపు వర్తిస్తుంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేది మే 24, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://careers.cdac.in/advt పరిశీలించగలరు.

×