Cci Jobs : సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ |Job replacement in Cement Corporation of India

Cci Jobs : సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ

అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేది జూన్ 30,2022గా నిర్ణయించారు. అభ్యర్ధులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Cci Jobs : సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ

Cci Jobs : న్యూదిల్లీలోని భారత ప్రభుత్వరంగ సంస్ధ అయిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 46 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి ఇంజనీర్ పోస్టులు 17 ఖాళీలు, ఆఫీసర్ పోస్టులు 19 ఖాళీలు ఉన్నాయి. ప్రొడక్షన్, మెకానికల్, సివిల్, మైనింగ్ , ఇన్ స్ట్ర్రుమెంటేషన్ , ఎలక్ట్రికల్ తదితర విభాగాల్లో ఇంజనీర్ ఖాళీలు ఉన్నాయి. మెటీరియల్ మేనేజ్ మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, హ్యూమన్ రిసోర్స్ తదితర విభాగాల్లో ఆఫీసర్ పోస్టుల ఖాళీలు ఉన్నాయి.

ఇంజనీర్ పోస్టుల విద్యార్హతకు సంబంధించి సంబంధిత స్పెషలైజేషన్ లో బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. నెలకు వేతనంగా 40,000వరకు చెల్లిస్తారు. అభ్యర్ధుల వయస్సు 35 ఏళ్లకు మించరాదు.

ఆపీసర్ పోస్టుల విద్యార్హతల విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఐసీఎస్ఐ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయో పరిమితి 35 సంవత్సరాలకు మించరాదు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు వేతనంగా 40,000 వరకు చెల్లిస్తారు.

అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేది జూన్ 30,2022గా నిర్ణయించారు. అభ్యర్ధులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్ధులు తమ దరఖాస్తులను పంపాల్సిన చిరునామా ; మేనేజర్ (హెచ్ ఆర్), సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, లోదీ రోడ్, న్యూదిల్లీ-110003. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.cciltd.in/పరిశీలించగలరు.

 

 

×