Job Notification : ఇన్ కాయిస్ లో ఉద్యోగాల భర్తీ.. మొత్తం ఖాళీలు ఎన్నంటే?..

ఎంపిక విధానానికి సంబంధించి ప్రాజెక్టు సైంటిస్ట్(1,2,3)పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్య్యూ ఉంటుంది. ప్రాజెక్టు సైంటిఫిక్ అసిస్టెంట్(1,2) పోస్టులకు రాతపరీక్ష

Job Notification : ఇన్ కాయిస్ లో ఉద్యోగాల భర్తీ.. మొత్తం ఖాళీలు ఎన్నంటే?..

Jobs (1)

Job Notification : హైద్రాబాద్ లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేశారు. ఇన్ కాయిస్ ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 82 ఖాళీలను భర్తీ చేయనుంది. భర్తీ చేయనున్న పోస్టుల వివరాల విషయానికి వస్తే ప్రాజెక్టు సైంటిస్లులు(1,2,3)62 ఖాళీలు, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్(1,2)20 ఖాళీలు భర్తీ చేయనున్నారు.

విద్యార్హతల విషయానికి వస్తే భర్తీ చేయనున్న పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీనితోపాటు పనిలో అనుభవం, టెక్నికల్ నైపుణ్యాలు కలిగి ఉండాలి. నెలకు జీతం 39,000రూపాయల నుండి 78,000 రూపాయల వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానానికి సంబంధించి ప్రాజెక్టు సైంటిస్ట్(1,2,3)పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్య్యూ ఉంటుంది. ప్రాజెక్టు సైంటిఫిక్ అసిస్టెంట్(1,2) పోస్టులకు రాతపరీక్ష అధాకరంగానే ఎంపిక చేస్తారు. అన్ లైన్ ద్వారా ఆయా పోస్టులకు ధరఖాస్తు చేసుకోవాలి. ధరఖాస్తుకు ఆఖరి తేది సెప్టెంబరు 22 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://incois.gov.in