JOBS : తెలంగాణా వైద్యాఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ

అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి ఎంబీబీఎస్, తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండలి. తెలంగాణా మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. సివిల్ సర్జన్ కు నెలకు 58,850రూ, నుండి 1,37050రూ చెల్లిస్తారు. ట్యూటర్ లకు నెలకు 57700 నుండి 1, 82,400రూ చెల్లిస్తారు.

JOBS : తెలంగాణా వైద్యాఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ

Medical Health Department

JOBS : తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖలో అధిక సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 1326 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రజారోగ్య ,కుటుంబ సంక్షేమ శాఖలో 751 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, వైద్య విద్య డైరెక్టరేట్ లో 357 ట్యూటర్లు, తెలంగాణా వైద్య విధాన పరిషత్ లో 211 సివిల్ సర్జన్ జనరల్ పోస్టులు, ఐపీఎంలో 7 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి ఎంబీబీఎస్, తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండలి. తెలంగాణా మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. సివిల్ సర్జన్ కు నెలకు 58,850రూ, నుండి 1,37050రూ చెల్లిస్తారు. ట్యూటర్ లకు నెలకు 57700 నుండి 1, 82,400రూ చెల్లిస్తారు. ఎంపిక విధానానికి సంబంధించి అర్హత పరీక్షలో, పని అనుభవం ద్వారా ఎంపిక ఉంటుంది.

అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ జులై 15, 2022 నుండి ప్రారంభమౌతుంది. దరఖాస్తులకు చివరి తేది ఆగస్టు 14, 2022గా నిర్ణయించారు.