జాబులే..జాబులు : నిరుద్యోగులకు గుడ్ న్యూస్

  • Published By: madhu ,Published On : January 30, 2019 / 02:50 AM IST
జాబులే..జాబులు : నిరుద్యోగులకు గుడ్ న్యూస్

ముంబై : జాబుల కోసం వెయిట్ చేసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇంటర్వ్యూల కోసం సిద్ధంగా ఉండండి..ఎందుకంటే వివిధ కంపెనీలు భారీగా ఉద్యోగ ప్రకటనలు చేయనున్నాయి. గతేడాదితో పోలిస్తే 31 శాతం అధికంగా నియామకాలు జరపాలని కంపెనీలు నిర్ణయించుకున్నాయి. మెర్సర్ మెిల్ రెండో వార్షిక నివేదిక నైపుణ్యాల నియామకాల స్థితి 2019 వెల్లడించింది. 2018లో 25 శాతం..ఉండగా ఇందుకు బడ్జెట్ 20 శాతం కంపెనీలు పెంచాయని తెలిపింది. జాబ్‌లు ఇచ్చే అధికారం కలిగిన ఉపాధ్యక్షులు, సీనియర్ కార్య నిర్వాహఖ ఉపాధ్యక్షులు, సీ సూట్ ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లు, డైరెక్టర్లు, 900 మంది నుండి సేకరించిన సమాచారంతో నివేదిక రూపొందించినట్లు సంస్థ తెలిపింది. 

సాంకేతికత పాత్ర చాలా కీలకమైందని…మెరుగైన నైపుణ్యాలు గలవారిని ఎంపిక చేసుకొనేందుకు ఇది సహాయపడుతోందని నివేదికలో పేర్కొంది. నిపుణులను ఎంపిక చేసుకోవడం..వారిని అలాగే కొనసాగిస్తూ..సామర్థ్యం వినియోగించుకోవడంలో సాంకేతికత దోహద పడుతుందని వెల్లడించింది. కీలక పోస్టులకు మాత్రం తగిన జీతం ఇస్తామన్నా..కరెక్టు అభ్యర్థులు దొరకడం లేదని పెద్ద సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. ఉత్తమమైన వారినే ఎంపిక చేసుకోవడం సవాల్‌గా మారుతోందని తెలిపారు. అత్యుత్తమ నైపుణ్యం గల వారి కోసం పోటీ రోజురోజుకు అధికమౌతోందని నివేదికలో వెల్లడించింది. వివిధ రంగాల్లో నియామకాల ధోరణి సరికొత్తగా మారనుందని వెల్లడించింది.