ఏడ్వకు తల్లీ.. నీతో పరీక్ష రాయిస్తా.. బాలిక హాల్‌ టికెట్ కోసం 5.5కి.మీ వెళ్లొచ్చిన పోలీసు!

  • Published By: sreehari ,Published On : February 26, 2020 / 02:07 AM IST
ఏడ్వకు తల్లీ.. నీతో పరీక్ష రాయిస్తా.. బాలిక హాల్‌ టికెట్ కోసం 5.5కి.మీ వెళ్లొచ్చిన పోలీసు!

పది నిమిషాల్లో పరీక్ష.. లేటు అయితే గేటు బయటే… పరీక్ష రాసేదెట్టా.. హాల్ టికెట్ లేదని ఇన్విజిలేటర్ ఆపేసింది. పరీక్ష రాయలేకపోవడంతో ఆ బాలిక కన్నీరుమున్నీరు అవుతోంది. ఇంతలో అక్కడికి వచ్చిన కోల్‌కతా పోలీస్ సార్జెంట్ చైతన్య మల్లిక్ బాలికను పరీక్ష రాసేందుకు సాయం చేశాడు. ఇంట్లో అడ్మిట్ కార్డును మరిచిపోయి పరీక్షా కేంద్రానికి వచ్చిన బాలిక సుమన్ కుర్రే కోసం ఏకంగా 5.5 కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి హాల్ టికెట్ తీసుకొచ్చాడు మల్లిక్.. 

ఆరోజు సోమవారం ఉదయం 11.40 గంటల సమయం అది.. జైస్వాల్ బిద్యమండిర్ పరీక్షా కేంద్రానికి బాలిక కుర్రే చేరుకుంది. పరీక్షా పేపర్లను పంపిణీ చేయడానికి ఐదు నిమిషాల ముందు కుర్రేను పరీక్షా కేంద్రంలోనికి ప్రవేశించకుండా ఇన్విజిలేటర్ అడ్డుకున్నారు. హాల్ టికెట్ చూపించమని అడిగారు. తాను ఇంట్లో మరిచి వచ్చానని లోపలికి అనుమతించాలంటూ ప్రాదేయపడింది.

రూల్స్ ప్రకారం… అడ్మిట్ కార్డు లేకుండా అనుమతించేది లేదని చెప్పేశారు. దాంతో పరీక్ష కేంద్రం దగ్గరే బాలిక కుర్రే ఏడుస్తూ ఉండిపోయింది. అక్కడే డ్యూటీలో ఉన్నా పోలీసులు జోక్యం చేసుకున్నారు. వివేకాండ రోడ్‌లో ఉన్న పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించకుండా విద్యార్థిని ఆపివేసినట్లు ఉల్తాడంగా ట్రాఫిక్ గార్డ్‌కు చెందిన సార్జెంట్ మల్లిక్‌కు సమాచారం అందింది. 

See Also>>ముక్కులో ఆక్సిజన్ ట్యూబ్..పక్కనే సిలిండర్ పెట్టుకుని ఇంటర్ పరీక్ష రాసిన బాలిక

ప్రోటోకాల్ ప్రకారం.. ఆమెను పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించకుండా ఆపివేశారు అని డిసిపి (ట్రాఫిక్) రూపేష్ కుమార్ అన్నారు. సార్జెంట్ మొదటి పని ఏమిటంటే.. బాలికను పరీక్షా రాస్తావంటూ ధైర్యం చెప్పడం.. అతను బాలికను చీఫ్ ఇన్విజిలేటర్ దగ్గరకు తీసుకొని వెళ్లి పరీక్షలో కూర్చోవడానికి అనుమతించమని విజ్ఞప్తి చేశాడు. అడ్మిట్ కార్డును తిరిగి తీసుకువస్తానని హామీ ఇచ్చాడు. అందుకు ఇన్విజిలేటర్ అంగీకరించారు. 

సమయం వృథా కాకుండా.. మల్లిక్ బాలిక తల్లిని సంప్రదించారు. 5.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సౌత్ టాంగ్రా రోడ్ వద్ద ఉన్న తన నివాసానికి చేరుకున్నారు. అతను కుర్రే అడ్మిట్ కార్డును తిరిగి తెచ్చి మధ్యాహ్నం 12.10 గంటలకు బాలికకు అప్పగించాడు. పరీక్షకు కేవలం 10 నిమిషాల ముందే విద్యార్థికి సహాయం చేయగలిగినందుకు సంతోషంగా ఉందని డిసి కుమార్ అన్నారు.