KU Degree, PG Exams : కృష్ణా యూనివర్శిటీ డిగ్రీ, పీజీ పరీక్షలు.. త్వరలో షెడ్యూల్ విడుదల

కృష్ణా విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల్లోవాయిదాపడ్డ డిగ్రీ, పీజీ, ఎంబిఎ, ఎంసీఏ మొదటి సెమిస్టర్‌ పరీక్షలను జులై రెండో వారంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

KU Degree, PG Exams : కృష్ణా యూనివర్శిటీ డిగ్రీ, పీజీ పరీక్షలు.. త్వరలో షెడ్యూల్ విడుదల

Ku Degree, Pg Exams

KU Degree, PG Exams : కృష్ణా విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల్లోవాయిదాపడ్డ డిగ్రీ, పీజీ, ఎంబిఎ, ఎంసీఏ మొదటి సెమిస్టర్‌ పరీక్షలను జులై రెండో వారంలో నిర్వహించనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేపట్టాలని విశ్వవిద్యాలయ పరీక్షా విభాగాన్ని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె.బి.చంద్ర శేఖర్‌ అదేశించారు.

ముందుగా నిర్ణయించిన ప్రకారం.. మే నెలలో ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. కరోనా వ్యాప్తి కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. వచ్చే జూలై నెలలో తిరిగి పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాటు చేయనున్నారు. పరీక్షల సమయపట్టికలు, పరీక్షా కేంద్రాల వివరాలను త్వరలో విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ డి.రామ శేఖర రెడ్డి తెలిపారు.

విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలు, పరీక్షా కేంద్రాలను కోవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని, విద్యార్థులు తగు రీతిలో పరీక్షలకు సిద్ధమవ్వాలని కోరారు. పరీక్షలకు అవసరమైన సామగ్రిని జూలై రెండో వారంరోజుల్లోగా సిద్ధం చేయాలని పరీక్షల నియంత్రణాధికారి డా.డి.రామ శేఖర రెడ్డి కళాశాలల సిబ్బంది, పరీక్షా విభాగపు సిబ్బందికి సూచించారు.